ఖమ్మం

కొత్తగూడెంలో కళాభారతి ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 11: కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్ అన్నారు. మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ బాలోత్సవ్ ముగింపు కార్యక్రమాలను ఆదివారం రాత్రి స్థానిక సిఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేశారు. తెలంగాణ బాలోత్సవ్ కన్వీనర్ మద్దెల శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కళాభారతిని ఏర్పాటు చేయిస్తానని అన్నారు. విద్యార్ధులను కళాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ బాలోత్సవ్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు కళారంగంలో కూడా అగ్రభాగాన నిలువాలని ఆకాంక్షించారు. తెలంగాణ బాలోత్సవ్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సినీ నృత్యమాస్టర్ శివశంకర్ తదితరులు ప్రసంగిస్తూ తెలంగాణ బాలోత్సవ్ భవిష్యత్‌లో జాతీయస్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకుడు గొల్లపల్లి దయానంద్, లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపోతు శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నాయకులు గోపాలరావు, జివికె మనోహర్, తెలంగాణ జెఎసి అధ్యక్షులు మల్లెల రామనాధం, డాక్టర్ రాజ్యలక్ష్మి, తెలంగాణ బాలోత్సవ్ నిర్వాహకులు అల్లి శంకర్, మారపాక కుమార స్వామి, ధన్‌రాజ్‌లతోపాటు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు భాష పరిరక్షణకు సమష్టి కృషి
కొత్తగూడెం, డిసెంబర్ 11: పరభాషా వ్యామోహాన్ని విడనాడి తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయటం, తెలుగు భాషా పరిరక్షణకు సమష్టి కృషి జరపాలని కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకటరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతులు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో మహాసభల కవి సమ్మేళనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక దశ నుంచే తెలుగుభాషపై మక్కువ పెంచేందుకు కృషి చేయాలన్నారు. తెలుగు మాధ్యమం పట్ల చిన్నచూపును విడనాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలన్నారు. మాతృభాషను మరచిపోతే మాత్రృమూర్తిని మరచిపోయినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంగ్లీషు మోజులోపడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధమంగా నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు తెలుగు పండితులు ఐక్యంగా కృషి చేయాలని కోరారు.(మిగతా 6లో) తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు ఒకటి నుంచి పదవ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను బోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకు మరేదీ చాటిరాదని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో వారి మాతృభాషలోనే విధ్యాభ్యాసం చేస్తారని, మాతృభాష ప్రధమ ప్రామాణికంగా కచ్చితంగా తీసుకోవాలని అన్నారు. భాషను నిర్లక్ష్యం చేస్తే జాతి క్షమించదని అన్నారు. తెలుగుభాషపై పటుత్వాన్ని పెంచుకున్న మాజీ ప్రధాని పివి నర్సింహారావు మరో 14 భాషల పట్ల కూడా ప్రావీణ్యం సంపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగు పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేటకు చెందిన ఉపాధ్యాయుడు సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన అడ్డం తిరిగిన ఆదర్శాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖాధికారి ఎస్ శ్రీనివాసరావు, కవులు, కళాకారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 11: ప్రజల ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పరిష్కారం చూపాలన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించారు. తమ గ్రామంలో అర్ధాంతరంగా నిలిపివేసిన మంచినీటి పథకాన్ని పునరుద్ధరించాలని, గ్రామంలో వేసిన బోరును పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ దుండేటి శాంతాకుమారి, గ్రామ ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. జీవో నెంబర్ 14 ప్రకారం తమకు రుణాలు మంజూరు చేయాలని, బ్యాంక్ అధికారులు వేధించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కమిటీ నాయకులు నాగరాజు, సిరికొండ ఉపేందర్, లక్ష్మీదేవిలు విన్నవించారు. చెరుకు రైతులకు టన్నుకు 3,150 రూపాయల మద్దతు ధర చెల్లించాలని మధుకాన్ షుగర్ ప్యాక్టరీ అందించే విధంగా కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలని, కాలిన చెరకుకు కోత విధించిన రూ.49.17లక్షల రూపాయలను వెంటనే రైతులకు ఇవ్వాలని కోరుతూ సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబుతో పాటు రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. తన భర్తను కోల్పోయిన తర్వాత పెద్దకుమారుడు గట్టినేని రమేష్ తనను ఇబ్బందులకు గురిచేస్తూ తనకు చెందిన మొత్తం 30 ఎకరాలను అతనే అనుభవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అతనిపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని కల్లూరుకు చెందిన లక్కినేని రంగనాయకమ్మ వేడుకున్నారు. తను బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నానని వైన్స్‌షాపు యజమాని ఎంఆర్‌పి ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారని దీనిని అరికట్టాలని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన ఎరకల వీరభద్రం కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో సర్వే నెంబర్ 194,195లో సీలింగ్ భూములను ఎస్టీలకు ఇచ్చారని వాటిని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు విక్రయించారని వారిపై చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని రఘునాధపాలెం గ్రామానికి చెందిన బోడ రామకృష్ణ, బోడ దీప్లా, భూక్య సోనా, పద్మ తదితరులు విన్నవించారు.
బయ్యారంలో ఉక్కు కోసం పాదయాత్ర
గార్ల, డిసెంబర్ 11: అపార ఖనిజ సంపద ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ న్యూడెమోక్రసీ కార్యకర్తలు సోమవారం గార్ల మండలం మద్దివంచ నుంచి జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. మద్దివంచలో పార్టీ జిల్లా నాయకుడు జడ సత్యనారాయణ పాదయాత్రను ప్రారంభించి ప్రసంగిస్తూ బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పొతామని చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ విస్మరించారని ఆరోపించారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ఖనిజం, నీటి వసతి ఉన్న ఏర్పాటులో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగటంతో పాటు అభివృద్ధి ఆమడ దూరంలోఈ గిరిజన ప్రాంత ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యేంత వరకు పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వం ఉద్యమించాలని సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ నాయకులు గౌని భద్రయ్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతకు సేవ చేయడం అదృష్టం
చింతకాని, డిసెంబర్ 11: అన్నదాతకు సేవచేయడం ఆదృష్టంగా భావించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం మండల పరధిలోని నాగిలిగొండ గ్రామంలో జరిగిన భూప్రక్షాళన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూప్రక్షాళన కార్యక్రమాన్ని రెవెన్యూ యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని కొనియాడారు. దశాబ్ధాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న రైతుల భూసమస్యలను భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. భూప్రక్షాళన కార్యక్రమంలో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. లక్షలోపు రైతుల ఋణాలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. వచ్చే సంవత్సరం నుండి రైతులకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి ఖర్చులకు ఇవ్వనున్న కెసిఆర్ రైతుల పక్షపాతని కీర్తించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విదంగా రైతుకు పెట్టుబడి ఖర్ఛులు ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయంగా పనిచేస్తున్నదన్నారు. అనంతరం తహశీల్ధార్ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మెర రాంమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, మంకెన రమేష్, సర్వే బృందం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
వాల్టా చట్టానికి తూట్లు..!!

కొత్తగూడెంరూరల్, డిసెంబర్ 11: నీరు, భూమి, చెట్లను పరిరక్షించేందు కు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వాల్టా యాక్టు చట్టం అమలులో నవ్వులపాలవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాల్సిన రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు ఉదాశీన వైఖరి అవలంబి ంచటమే ఇందుకు కారణమని పలువు రు వ్యక్తం చేస్తున్నారు. రేయనక, పగలనక అన్ని వేళల్లో నిరంతరం వాగులు, వంకల్లోని ఇసుక అక్రమంగా తరలిపోతూనే ఉంది. ప్రస్తుతం సీజన్ ప్రా రంభం కావటంతో బోరుబావుల తవ్వకాలు మొదలయ్యా యి. బోరుబావుల తవ్వకానికి నిబంధనల ప్రకారం గ్రా మీణ ప్రాం తాల్లో తహశీల్దారు, అర్బన్‌లో మున్సిపాలిటీల నుంచి అనుమతి పొందిన తర్వాతనే బోరుబావులను తవ్వాల్సి ఉంది. అనుమతి తీసుకుంటే ముందుగా జియాలజిస్టు పరీక్షలు చేయాల్సి ఉండటంతో భూగర్భం లో ఎంత లోతులో నీళ్లు ఉన్నాయి, అ సలు నీళ్లు పడతాయా, లేదా అనే విషయాల పట్ల కూడా ముందుగానే అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇవేవీ లేకుండానే గత నెల రోజులుగా ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకున్న బోరుబావులను తవ్వే యం త్రాల యజమానులు అనుమతులు లేకు ండానే అశాస్ర్తియంగా, ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. అమాయక ప్రజల నుంచి అడుగు లో తు తవ్వకానికి రోజుకో రేటు చెపుతూ యంత్రాల యజమానులు అక్రమంగా దోచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నీళ్లుపడినా, పడకపోయినా బో రుబావి తవ్వకాన్ని బట్టి అడుగుల లె క్కన డబ్బులు చెల్లించాల్సిందేన ని ము ందుగానే యజమానులు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతే కాకుండా ఒక్కో ఊరికి నలుగురు, ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బో రుబావులను తవ్వుతున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయం వర కూ గుట్టుచప్పుడు కాకుండా బోరుబావులను తవ్వి పని చక్కబెట్టుకుంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కొందరు రెవెన్యూ ఉద్యోగుల కనుసన్నల్లోనే బోరు బావులను తవ్వుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలతో పాటు కొత్తగూడెం ము న్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాల్వంచ, జూలూరుపాడు మండలాలకు చెం దిన బోరు యంత్రాల యజమానులు తవ్వకాలు జరుపుతున్నప్పటికీ అధికారులు ఉదాశీన వైఖరి అవలంబించటం పలు అనుమానాలకు దారితీస్తోంది. అధికారుల వైఖరిని సొమ్ము చేసుకుంటున్న యం త్రాల యజమానులు ఇదే వైఖిరిని కొనసాగిస్తే భూగర్భజలాలు ఇంకిపో యి భవిష్యత్‌లో నీటికోసం ప్రజలు మ రింత ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమా దం ఉందని పలువురు అంటున్నారు.