ఖమ్మం

రాములోరికి నిత్యకల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 14: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయం తలుపులు తీసిన అనంతరం తొలుత దశరథ తనయుడు శ్రీరాముడికి సుప్రభాత సేవ నిర్వహించారు. ఆరాధన చేసి నామార్చనలు జరిపారు. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పుణ్యజలాలతో రామయ్య పాదుకలకు అభిషేకం నిర్వహించారు. నిత్యకల్యాణ క్రతువులో భాగంగా క్షేత్ర విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. భక్తుల గోత్రనామాలను అర్చకులు స్వామికి విన్నవించారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామికి నైవేద్యం సమర్పించాక దర్బారు సేవ వేడుకగా జరిగింది.
రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
భద్రాచలం టౌన్, డిసెంబర్ 14: నిజామాబాద్‌లో ఈ నెల 15, 17 తేదీల్లో జరి గే రాష్టస్థ్రాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలకు భ ద్రాచలం సిటీస్టైల్ జిమ్‌కు చెందిన ఐదుగురు యువకులు ఎంపికైనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.మల్లేష్ తెలిపారు. జూనియర్స్ 53 కేజీల విభాగం లో వంశీ, 105 కేజీల విభాగంలో అబ్దుల్‌ఊపర్, మాస్టర్స్ 66 కేజీల విభాగంలో జి.రామకృష్ణ, 75కేజీల విభాగంలో ఎం.్భద్రూనాయక్, 93కేజీల విభాగంలో ఎస్కే అబ్దుల్‌ఫరూక్‌లు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన యువకులు గతంలో ఎన్నోసార్లు జిల్లా, రాష్టస్థ్రాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొంది పతకాలను సాధించారని జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ కోశాధికారి జీవీ రామిరెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులను అసోసియేషన్ అధ్యక్షుడు వసంతరావు, కోశాధికారి బొగాల వీరారెడ్డి, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, క్రీడాకారులు అభినందించారు.
నెమలిపేట గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి
అశ్వారావుపేట, డిసెంబర్ 14: మండల పరిధిలోని నెమలిపేట గ్రామ ంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొనటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రూ లక్షలు వెచ్చించి మంచి నీటి పథకాలు ఏర్పాటు చేసినప్పటికీ పథకాలు సక్రమంగా పనిచేయక పోవటంతో ప్ర జలు మంచి నీటి కోసం అల్లాడుతున్నారు. వ్యవసాయ కూలీ మీద ఆధారపడి జీవించే తాము గ్రామంలో మంచి నీటి ఎద్దడి నెలకొనటం వలన మైళ్ల దూరం వెళ్లి వ్యవసాయ విద్యుత్ మో టార్ల వద్ద నుంచి నీళ్లను తెచ్చుకుని కా లం వెళ్ల తీసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగు నీటి కోసం ప్రత్యేకంగా ఒక మనిషి ఇంటి వద్ద ఉండాల్సి వస్తుందని వాపోయారు.గ్రా మం లో చేతి పంపు ఒక్కటే ఉండటం వల న సక్రమంగా రావటం లేదని, దీంతో గ్రామస్థులు దానిపైనే ఆధారపడాల్సి వస్తుందని తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.