ఖమ్మం

నీటి ఎద్దడిని నివారణలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఏప్రిల్ 18: జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని దానిని పరిష్కరించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వత ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం అనేకం చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వానికి నీటి ఎద్దడి సమస్య కనబడటంలేదాని ప్రశ్నించారు. కనీస అవసరాలు తీర్చలేని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తుందని అనుకోవడం ఆశాగానే మిగులుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో చుక్క నీరు లభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని, ప్రత్యాయమ్న ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ తీసుకోవాల్సిన చర్యల పట్ల పాలకులు నిర్ణక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో కనీసం తాగేందుకు నీరు దొరక పోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పశువులు నీటికోసం అల్లాడుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాలకులు తమ పార్టీ అభివృద్దికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలకు ఇవ్వడంలేదని ఆరోపించారు. జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడిని నివారించేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు మిక్కిలినేని నరేందర్, తాజుధ్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు భూములిస్తాం
వేంసూరు, ఏప్రిల్ 18: చెరువుకింద భూములుకోల్పోయిన భూ నిర్వాసితులకు భూములిస్తామని రాష్టర్రోడ్డ్భువనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. మండలంలోని దుద్దేపూడి గ్రామంలో చెరువును సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ భూములు కోల్పోయిన నిరుపేదలకు, భూములు లేనివారికి ప్రభుత్వమే కొనుగోలుచేసి ఇస్తుందన్నారు. నిర్వాసితుల వివరాలను సేకరించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. తుంబూరు, దుద్దేపూడి చెరువులకు చెక్‌డ్యాంలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భవిష్యత్తులో మండలంలో కరువు రాకుండా ఉండేందుకు గోదావరి జలాలనుతీసుకొచ్చి మండలాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. రైతు సంక్షేమమే తెలంగాణాప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం కందుకూరులోరూ.4కోట్ల వ్యయంతో చేపట్టిన లింగగూడెం చెరువుపనులను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెల్ది జగన్‌మోహన్‌రావు. సొసైటీ అధ్యక్షుడు మోరంపూడి ముత్తయ్య, తహశీల్దార్ టి వేణుగోపాల్, ఐబిడి శ్రీనివాస్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.