ఖమ్మం

ఎనీ టైం నో మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 12: సంక్రాంతి పండగ జరుపుకునేందుకు ఎదురు చూస్తున్న తరుణంలో ఎటిఎం కేంద్రాలు మొరాయిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎటిఎం కేంద్రాలు ఎనీ టైం నో మనీ అనే విధంగా మారాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నగదు కోసం ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. బ్యాంకు ఖాతాదారులకు రూ 5 వేలకు మించి డ్రా చేయాలంటే అనేక ఆంక్షలు విధిస్తుండటంతో అధిక శాతం ఖాతాదారులు ఎటిఎంలపై ఆధారపడుతున్నారు. ఎటిఎంలు మూడు రోజులుగా సక్రమంగా పనిచేయని పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంతోపాటు పాల్వంచ, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, టేకులపల్లి, పలు మండలాల్లో ఎటిఎం కేంద్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు సెలవులు ప్రకటించటంతో దైవ దర్శనాలకు, పర్యాటక కేంద్రాలకు వెళ్తుండటంతో నగదు కోసం ఎటిఎం సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎటిఎంలో నగదు ఉంచకపోవటంతో హైద్రాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్ వంటి నగరాల నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కార్మికులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రైవేటు కార్మికులకు సైతం బ్యాంకుల ద్వారానే వేతనాలు చెల్లిస్తుండడం, వేతనాలు బ్యాంకు ఖాతాల్లో పడినట్లు సమాచారం వస్తున్నా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచే బ్యాంకులకు నగదు తక్కువగా వస్తోందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నగదు రహిత లావాదేవీపై ఆసక్తి చూపుతోంది. దీంతో వస్త్ర, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో కొనుగోలు చేసిన వస్తువులను డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే ఆ సదుపాయం కొన్ని షాపుల్లో లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అధిక శాతం మంది ప్రజలకు డెబిట్ కార్డుపై అవగాహన లేకపోవటం, కార్డులు పూర్తి స్థాయిలో అందకపోవటంతో నగదు ద్వారానే లావాదేవీలు కొనసాగించే పరిస్థితి ఉంది. నగదు రహిత లావాదేవీల కోసం బ్యాంకు అధికారులు కావాలనే ఎటిఎంలలో నగదును అందుబాటులో ఉంచటం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి పండగ వేడుకలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు అధికారులు ఎటిఎం కేంద్రాల్లో నగదు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వ సెలవులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ఖాతాదారుల అవసరాల కోసం ఎటిఎం కేంద్రాల్లో నగదు ఉంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
వివేకానందుని జీవితం యువతకు స్ఫూర్తిదాయకం
కామేపల్లి, జనవరి 12: స్వామి వివేకానందుని జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని మండల తహశీల్దార్ టి.వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం వివేకానందుని 155వ జయంతి వేడుకలు కామేపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామేపల్లి, రామకృష్ణపురం కూడలుల్లో స్వామిజీ విగ్రహనికి, అదే విధంగా గీతాంజలి విద్యాలయంలో, సాక్షర భారత్ ఆధ్వర్యంలో విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు తమ సమయం వృధా చేసుకోకుండా విద్యా, ఉపాధి, క్రీడా రంగాల్లో మెరుగుపర్చుకొని ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ప్రజా ఉపయోగకరమైన పనులు చేపట్టే విధంగా ముందుకు నడవాలని, వివేకానందుని లక్ష్యం అదేనని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి జితేందర్‌నాయక్, ఎంసివో రమేష్, మండల బిజెపి అధ్యక్షులు రామచంద్రయ్య, రంగారావు, భూక్యా శ్రీనునాయక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.