ఖమ్మం

చింతపల్లికి అంతర్జాతీయ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, జనవరి 18: సైబీరియా పక్షులు ఖండాంతరాలు దాటి చింతపల్లి గ్రామానికి రావడం ఆశ్చర్యకరమని, ఈ గ్రామాన్ని అంతర్జాతీయ విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఐడీసీ చైర్మన్ బుడాన్ బేగ్ అన్నారు. ఖమ్మం నగరానికి చెందిన జంగా అనంత్‌కుమార్ ఇటీవల తన మనుమడు జంగా భగత్‌తో సహా కుటుంబ సభ్యులు చింతపల్లి గ్రామాన్ని సందర్శించి సైబీరియా పక్షుల విన్యాసాలను తిలకించారు. ఈసందర్భంగా ఆయన పక్షుల నేపథ్యం గురించి గ్రామస్థులను ప్రశ్నించగా అందరూ వచ్చి చూసి వెళ్ళేవారేగాని, తమ బాధలనెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆ పక్షుల వల్ల కలిగే నష్టాలను వివరించారు. దాంతో చలించిన అనంత్‌కుమార్ తన మనుమడు పేరుతో ఒక్కొక్క చింతచెట్టుకు వెయ్యి రూపాయల చొప్పున గురువారం తన స్నేహితుడు బుడాన్ బేగ్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. అదేవిధంగా వారిని సత్కరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈసందర్భంగా బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు, తోట రామారావులు మాట్లాడుతూ గ్రామంలో చింతచెట్లు ఎక్కువగా ఉండటం, సహృదయత, రక్షణ కల్పించడం వల్లే ఆ పక్షులు వస్తున్నాయన్నారు. పాలేరు - పర్ణశాల టూరిజంలో చింతపల్లి గ్రామాన్ని కూడా చేర్చేలా కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు చింతచెట్లు నాటాలని వారు సూచించారు. చింతపల్లి గ్రామాన్ని పర్యావరణ కేంద్రంగా, చెరువును ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. సర్పంచ్ తోట జగన్, మాజీ ఎంపిపి పగిళ్ళ వీరభద్రంలు మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రతి సంవత్సరం పరిహారం అందజేస్తే ఊరంతా మొక్కలు పెంచేందుకు ముందకొస్తారన్నారు. కార్యక్రమంలో వితరణ దాత జంగా అనంత్‌కుమార్, న్యాయవాదుల జెఏసి నాయకుడు తిరుమలాచారి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తోట వీరభద్రం, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్‌టిఆర్
చింతకాని, జనవరి 18: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నున్నా తాజుద్దీన్ అన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ 22వ వర్ధంతిని మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌టిఆర్ అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నేరడ, లచ్చగూడెం, అనంతసాగర్, ప్రొద్దుటూరు, నాగులవంచ, చిన్నమండవ, గ్రామాలలో ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నున్నా తాజుద్దీన్ మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు, గూడు, నీడ ప్రధాన లక్ష్యంతోపనిచేసి రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్రవేసిన మహనీయుడు ఎన్‌టిఆర్ అని కీర్తించారు. ఎన్‌టిఆర్ పాలనలో ప్రతి ఒకరికి భరోసాతో పాటు ఆత్మగౌరవం పెరిగిందన్నారు. నేడు పాలకులు అవలంభిస్తున్న ప్రతి పధకం ఆనాడు ఎన్‌టిఆర్ ప్రారంభించినవేనన్నారు. నటుడిగా, ముఖ్యమంత్రిగా, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, సంక్షేమ పధకాల రూపకర్తగా రాష్ట్ర ప్రజల మన్ననలను పొందిన ఏకైకవ్యక్తి ఎన్‌టిఆర్ అని కీర్తించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే ఎన్‌టిఆర్‌కు నిజమైన నివాళన్నారు. అనంతరం నేరడ, లచ్చగూడెం గ్రామాలలో ఆన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, తెలుకుంట్ల శ్రీనివాసరావు, నన్నక గోపాలరావు, మల్లేల వెంకటేశ్వర్లు, గుడిమెట్ల వెంగళదాసు, పసుపులేటి శ్రీనివాసరావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు ఆయా గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.