ఖమ్మం

కుటుంబ పాలనకు చరమగీతం పాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనను కూల్చి వేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ ప్రజలను కోరారు. గార్ల మండలం గోపాలపురం పంచాయతీ పరిధిలోని అయా పార్టీలకు చెందిన వారు శనివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికి పినిరెడ్డిగూడెం గ్రామంలోపార్టీ కండువాలు కప్పి అహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రాణ త్యాగాల ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ సానుభూతితో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టి కుటుంబ పాలన సాగిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు, నియామకాలు, నీళ్ళు తమకే దక్కుతాయని మాయమాటలు చెప్పిన కేసీఆర్ రైతులు, నిరుద్యోగులు, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ గృహలు నిర్మించటం జరిగిందని బలరాం నాయక్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో పైపులైన్లు వేస్తున్నారే తప్ప నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలియని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతో శాసనసభ్యుడైన కోరం కనకయ్యకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బలరాం నాయక్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, భూక్య దళ్‌సింగ్, రామచంద్రునాయక్, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు మహ్మద్ జానీ, ఎంఏ జలీల్, మండల నాయకులు దనియాకుల రామారావు, మండారాముగౌడ్, తాళ్ళపల్లి క్రిష్ణగౌడ్, శ్రీనివాస్, ఇమ్మడి రమేష్, రూపాబాయి తదితరులు పాల్గొన్నారు.