ఖమ్మం

స్వర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 21: ‘పలుకే బంగారమాయెనా’.. అదిగో భద్రాద్రి గౌతమి.. ఇదిగో చూడండి’ అంటూ సంగీత విద్వాంసులు సంకీర్తనలు ఆలపించడంతో భద్రగిరి రామనామ స్మరణతో ఓలలాడింది. భక్తి పారవశ్యంతో పులకరించింది. వందలాది మంది వాగ్గేయకారుల గాత్రంతో తన్మయత్వం చెందింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలుగువారి గుండె వెలుగుగా నిలిచిన అపర రామ భక్తుడు భక్త రామదాసు 385వ జయంతిని పురస్కరించుకుని భద్రాచలంలో ఐదు రోజులపాటు నిర్వహించే వాగ్గేయకారోత్సవాలు ఆదివారం ఘనంగా, కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. భక్తాగ్రేసరునికి కళాకారులు తమ కీర్తనలతో స్వర నీరాజనం పలికారు. 5 రోజుల పాటు జరిగే సంగీత స్రవంతి వాగ్గేయకారోత్సవాలు తొలి రోజు వైభవంగా ప్రారంభం కాగా, దేవస్థానం ఈఓ ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభిషేకం.. నగర సంకీర్తన: రామదాసు జయంతి పురస్కరించుకుని గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర సంకీర్తన, భాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామాలయ ప్రాంగణంలోని రామదాసు విగ్రహానికి ముఖ్య అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. తొలుత శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరులకు రామదాసు పేరిట అష్టోత్రం నిర్వహించారు. అంతకు ముందు దేవస్థానం ఈఓ ప్రభాకర శ్రీనివాస్, నేండ్రగంటి కృష్ణమోహన్, రామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాస్, కళాకారులు, భక్తులు నగర సంకీర్తన చేశారు. రామదాసు భజన గీతాలను ఆలపిస్తూ గోదావరి తీరానికి చేరుకున్నారు. గోదావరికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం శోభాయాత్రగా రామదాసు విగ్రహం వద్దకు చేరుకుని అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో భక్త రామదాసు జన్మ నక్షత్రం పేరుతో రామయ్యకు అభిషేకం చేశారు. ఆయన వారసుడు కంచర్ల శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచామృతాలతో స్వామికి విశేష తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా తన భక్తుడు రామదాసుకు స్వామి తరఫున శేషమాలికలు, శేష వస్త్రాలు అందజేశారు. రామదాసు చిత్రపటానికి వేద పండితులు మంగళాశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అక్కడ వాగ్గేయకారోత్సవాలను ప్రారంభించారు.
నవరత్న కీర్తనలతో హోరెత్తిన భద్రాద్రి: దేవస్థానం ఈఓ ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్ జ్యోతి ప్రజల్వన చేసి వాగ్గేయకారోత్సవాలను ప్రారంభించారు. రామ సేవకుడిగా ఈ ఉత్సవాలను, రామదాసు రచించిన కీర్తనలకు ప్రాచుర్యం కల్పించే క్రతువులో తాను భాగస్వామినైనందుకు ఎంతో ఆనందంగా ఉందని నేండ్రగంటి కృష్ణమోహన్ సంతోషం వ్యక్తం చేశారు. 5 రోజులపాటు వాగ్గేయకారోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఆయనను దేవస్థానం ఈవో అభినందించారు. ఇటువంటి రామ సేవకులు చరితార్థులని ఆయన ప్రశంసించారు. అనంతరం నవరత్న కీర్తనలతో కళాకారులంతా కలిసి ఆలపించిన వాగ్గేయకారుల కీర్తనలతో భద్రిగిరి హోరెత్తింది. సంగీతప్రియులు పరవశించిపోయారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత కళాకారులతో చిత్రకూట మండపం కిటకిటలాడింది.
కుటుంబ పాలనలో ఇమడలేం...
* మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు

ఖమ్మం, జనవరి 21: టిఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని, అందులో ఇమిడే పరిస్థితి లేదని, అందుకే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఆయన ఇంట్లో విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని, దానిని నిలుపుకోలేకపోతున్నదన్నారు. ప్రస్తుతం కుటుంబ పాలన కొనసాగుతున్నదని, దానిని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తన 34ఏళ్ళ రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశానని, ఆ పార్టీ మనుగడ రాష్ట్రంలో ప్రశ్నార్థకం కావడంతో టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళానన్నారు. అక్కడ అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండటం, కనీసం విలువలేకపోవడం, కుటుంబంలోని వారు చెప్పినట్లే వినాల్సి రావడం, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితులలో తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సి వచ్చిందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుతో పాటు తనను నమ్ముకున్న వారికోసం తాను రేణుకాచౌదరి ద్వారా రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి తాను ఖమ్మం కేంద్రంగానే పనిచేస్తానన్నారు. తొలుత ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, అన్ని డివిజన్లలో ఔత్సాహిక కార్యకర్తలను తయారు చేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంపై దృష్టి సారిస్తానన్నారు. ఫిబ్రవరి నేలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తానని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన లేకుండా పోయిందని, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నారని వెల్లడించారు.
అధికార టిఆర్‌ఎస్‌లో అనేక మంది నేతలు ఉండలేక ఇబ్బంది పడుతున్నారని, వారంతా త్వరలోనే తమతో కలిసే అవకాశం ఉందని ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మం నగరంలోని పలువురు కార్పొరేటర్లతో పాటు జిల్లాలోని అనేక మంది నేతలు తమతో టచ్‌లోనే ఉన్నారని, వచ్చే జూలై, ఆగస్టు నుంచి చేరికలు విస్తృతమవుతాయన్నారు. రేణుకాచౌదరి ఈ నెల 22, 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నదని, ఆ పర్యటన తరువాత తమ క్షేత్రస్థాయి ప్రణాళికను విడుదల చేస్తామన్నారు. ఇష్టాగోష్టిలో నాయకులు పంతంగి వెంకటేశ్వర్లు, రాందాస్, మాధవి తదితరులు పాల్గొన్నారు.