ఖమ్మం

ఫార్మా-డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 13: ఫార్మా-డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మా-డి విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలెపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13రోజులుగా వారు ఆందోళనలు చేపట్టినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు అన్ని అర్హతలున్నప్పటికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం సరియైన చర్య కాదన్నారు. రాష్ట్రంలో వైద్యుల కొరత ఉన్న ప్రాంతాలలో వీరికి ఉద్యోగ అవవకాశాలు కల్పించి ప్రజలకు వైద్య సేలందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మ-డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా తాము రాష్టవ్య్రాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేష్, ఫార్మా-డి విద్యార్థుల అసోసియేషన్ నాయకులు యాకూబ్‌పాషా, అనిత తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఉన్నవారికి పెన్షన్లు ఇవ్వాలి
నేలకొండపల్లి, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో అనారోగ్యంతో మంచంపైనే ఉంటున్న వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కందాల జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నేలకొండపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పలు గ్రామాలలో పక్షవాతం వల్ల కదల్లేని వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అలాగే ఆసరా పెన్షన్ల పంపిణీలో జాప్యంలేకుండా ప్రభుత్వం చూడాలన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.