ఖమ్మం

ఓంకారనాదంతో మార్మోగిన నీలాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి, ఫిబ్రవరి 13: దారులన్నీ కిక్కిరిసి పోయాయి..చిన్నాపెద్దా కుటుంబాలతో దేవాలయాలు నిండిపోయి జనమయంగా మారింది. నిర్మానుష్యంగా ఉండే నీలికొండలు ఓంకారనాదంతో మార్మోగాయి. వేలాదిమంది భక్త జనం నీలాద్రీశ్వరాలయానికి పోటెత్తారు. పోలీసు నిఘా మాటున మంగళవారం నీలాద్రి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మండల పరిధిలోని భవన్నపాలెం గ్రామం నీలాద్రీశ్వరాలయంలో తెల్లవారు ఝామునుండే అభిషేకాలతో ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గంటగంటకు జనం ప్రవాహంలా తరలి రావటంతో అటవీ ప్రాంతమంతా నిండి పోయింది. ఓం నమఃశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తజనం భక్తి పారవశ్యంతో పొంగి పోయారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మొక్కుబడులు తీర్చుకొని నీలాద్రీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, అడిషినల్ కమీషనర్ కొల్లు సురేష్ కుమార్ వంటి ప్రముఖులు నీలాద్రీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. సత్తుపల్లి, తిరువూరు డిపోలకు చెందిన బస్సులు భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలలో భక్తులు పెద్ద ఎత్తున నీలాద్రికి చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో రద్దీ ఎక్కువవటంతో లంకపల్లి-నీలాద్రి మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కల్లూరు ఏసీపీ రాజేష్, సిఐ మడతా రమేష్, ఎస్‌ఐ నరేష్‌ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండలపైకి భక్తులను ఎక్కకుండా పోలీసులు నియంత్రించారు. ఆలయకమిటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, ఇఓ పాకాల వెంకటరమణ, భక్తులకు అన్ని ఏర్పాట్లతో పాటు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలపరిధిలోని గుట్టపాడు, మర్లకుంట, గంగదేవిపాడు, లింగగూడెం గ్రామాలల్లోని శివాలయాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.