ఖమ్మం

సామాజిక మాధ్యమాల ప్రచారంతో నేతల్లో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 13: ఇటీవల కాలంలో సర్వేల పేరుతో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలు రాజకీయ పార్టీల నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ సర్వేల పేరుతో తమకు పోటీ చేసేందుకు అవకాశం వచ్చిందని, మరికొన్ని సర్వేల్లో తన స్థానంలో చనిపోయిన వ్యక్తి పేరు పోటీలో ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. దీంతో తమ పార్టీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఈ సర్వేలు నిజమేనా అనేది ప్రశ్నార్ధకంగా ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వాటి దూకుడుకు పార్టీల నేతల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికలు జరిగేందుకు ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనున్నదని కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని జరుగుతున్న ప్రచారం మరింత ఊపందుకుంది. సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెబుతున్న సామాజిక మాధ్యమాల సర్వేలు ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు మినహా మిగిలినవన్ని ప్రతిపక్ష పార్టీలే దక్కించుకుంటాయని చెబుతున్నాయి. అస్సలు కొన్నిచోట్ల అధికార పార్టీ పోటీలో కూడా ఉండదని చెబుతుండటం విశేషం. ఈ సర్వేలను పరిశీలించిన ఆయా పార్టీల నేతలు ఇది నిజంకాదని కొట్టివేస్తున్నప్పటికీ ఇది మరింత ప్రచారమైతే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని భయపడుతున్నారు. ఎక్కువసార్లు ప్రజల వద్దకు ఇది చేరితే ప్రజల ఆలోచన సరళి మారే అవకాశం ఉందని భయపడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఈ సర్వేలు వస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో అధికార పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. అభివృద్ధిలోని మంచికంటే చెడును అధికంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుంటున్నారు. దీనిపై పలువురు నేతలు పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఆ జాబితా నిజమా, ఎవరు ప్రకటించారు అనేది ప్రశ్నార్ధకంగా ఉన్నది. అయితే అందులో అశ్వారావుపేట స్థానానికి దివంగత ఎమ్మెల్యే మిత్రసేన పోటీ చేస్తారని ఉండటం గమనార్హం. అదే తరహాలో రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లో పెద్దగా లేని నేతల పేర్లు, మరికొన్ని చోట్ల ఇటీవల ఆ పార్టీలో చేరిన వారిపేర్లు చేర్చారు. దీనిపై కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కువ మంది దీనిని కొట్టివేశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో అనసవర ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాజకీయ పార్టీలే ప్రయత్నించాలని కోరిన వారి సంఖ్య కూడా అధికమవుతుండటం విశేషం. రోజుకో రకంగా వస్తున్న సర్వేలు ప్రజల్లో, పార్టీల నేతల్లో అలజడిని సృష్టిస్తున్నాయి.