ఖమ్మం

భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపురెడ్డిపల్లి, ఫిబ్రవరి 18: సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేస్తే సహించేదిలేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టులో పట్టా లేని భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. బంగారు తెలంగాణ అంటూ కెసిఆర్ బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నాడని ఎద్దేవ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిచడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి రైతలకు సంకెళ్ళు వేసిన కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపక తప్పదన్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాటిపై ఉద్యమించాలిని కార్యకర్తకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలన్నీ అధికార పక్షానికే అందుతున్నాయని సామాన్యులకు మొండి చెయ్యి చూపిస్తున్నారన్నారు. పదవులు కాదు పార్టీయే ముఖ్యం అన్నారు. కార్యకర్తలే నా వారసులనీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తలకు అండాగా నిలుస్తానని రేణుకాచౌదరి అన్నారు. అనంతరం మర్రిగూడెం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మల్లు రమేష్, ఎడవల్లి కృష్ణ, బరిషల భద్రయ్య, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, ధనుంజయ నాయక్, రాందాస్ నాయక్, రామారావు, వనమా గాంధీ, దోసపాటి రాంబాబు, పుల్లారావు, కుంజ శ్రీను, లాలు, తారుపతిరావు, సున్నం నాగమణి, రామనాధం, ముత్తయ్య, రాజు, విజయ, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.