ఖమ్మం

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓసీలో నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఫిబ్రవరి 25: బొగ్గువెలికితీత పనులను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం చేసిన చట్టాన్ని వెంటనే విరమించుకోవాలని సీఐటియు నాయకులు జెవిఆర్ ఓసి ఫిట్ కార్యదర్శి కె. శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి ఓసిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బొగ్గుగనులు ప్రైవేటుఫరం చేయడం చట్టవిరుద్ధమన్నారు.మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు గుత్త్ధాపత్యంలో ఉన్న గనులను 1973 సంవత్సరంలో జాతీయం చేశారన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఆదీనంలో ఉన్నప్పుడే కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఇక ప్రైవేటువారి ఆదీనంలోకి వెలితే కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. కార్మికులే కాదు బొగ్గు ఆదారిత పరిశ్రమలు ధర్మల్ విద్యుత్‌ప్లాంట్‌లకు ఇప్పుడు ఇస్తున్న ధరలకు ప్రైవేటు యాజమాన్యాలు అందించలేవని తద్వారా విద్యుత్ భారం కావటంతోపాటు ధరలు పెరుగుతాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతరువాత దశలవారీగా జాతివ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు ఇదే తరహాలో మోడీ వ్యవహరిస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రమణ, సీతారామరాజు, విజయ్‌కుమార్, కొలికపోగు సర్వేశ్వరరరావు, రామారావు పాల్గొన్నారు.