ఖమ్మం

బ్యాంకులను దివాలా తీయిస్తున్న ఘనత బీజేపీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, ఫిబ్రవరి 25: దేశంలోని బ్యాంక్‌లను దివాలా తీయిస్తున్న ఘనత బిజెపిదేనని సిపిఎం రాష్టక్రమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు విమర్శించారు. మండల కేంద్రం చింతకాని సిపిఎం కార్యాలయంలో ఆదివారం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశం ఆర్ధిక సంక్షోభం దిశగా వెళ్లడానికి బిజెపి అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. లక్షల కోట్లు ఋణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన వారికి బిజెపి అండగా ఉంటున్నదన్నారు. వ్యవసాయ, ఆర్ధిక రంగాలు పతనమవడానికి ప్రధాని మోడి కారకుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పంతా బ్యాంక్‌లదేనని ఆర్ధికమంత్రి అరుణ్‌జెట్లీ అనడం కేంద్రప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజావ్యతిరేకపాలనలు కొనసాగుతున్నాయని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రజాపోరాటాలకు ప్రజలు మద్దతు తెలపాలన్నారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు సామినేని రామారావు, కల్యాణపు వెంకటేశ్వర్లు, వత్సవాయి జానకిరాములు, బల్లి చినవీరయ్య, గడ్డం రమణ, మద్దినేని బసవయ్య, తోటకూరి వెంకటనర్సయ్యలు పాల్గొన్నారు.

పవిద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
బోనకల్, ఫిబ్రవరి 25: మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఎల్‌అండ్‌టి ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టి ప్రతినిదులు, ఉపాధ్యాయుడు చింతమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మెరుగైన విద్య అందుతుందన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు వారు ఏ రంగంలో రాణిస్తారో వారి నైపుణ్యాన్ని గుర్తించి వారి ప్రతిభను వెలికితీయాల్సిన భాద్యత ఉందన్నారు.