ఖమ్మం

నగరాల సుందరీకరణకు ప్రత్యేక నిధులు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), మార్చి 13: రాష్ట్రంలోని ప్రతి నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ఆకర్షణీయంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు టియుఎఫ్‌ఐబిసి నుండి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్థి శాఖామంత్రి కె తారక రామారావు అన్నారు. నగర పాలక సంస్థలతో పాటు నగర పంచాయతీల అభివృద్థి, సుందరీకరణ పనులపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 74అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయని, త్వరలోనే వాటి సంఖ్య 145కు పెరుగుతాయన్నారు. 15వేల జనాభా గల గ్రామ పంచాయతీ అర్బన్, లోకల్ బాడీస్‌గా అప్‌గ్రేడ్ అవుతాయని, 33లక్షల జనాభా గల గ్రామీణ ప్రాంతాలు మున్సిపల్, పట్టణ ప్రాంతాలలో కలుపనున్నట్లు ఆయన తెలిపారు. నగర, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రత్యేక ప్రణాళికతో అభివృద్థి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాటికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పనులు గుర్తించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు నిధులు కేటాయిస్తామన్నారు. కౌన్సిల్‌కు సంబంధం లేకుండా నిధుల వినియోగ అధికారం కలెక్టర్లకు కల్పించడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంతో పాటు నగర పంచాయతీలలో ప్రతి జంక్షన్ ఆకర్షణీయంగా ఉండాలని, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పబ్లిక్ పార్కుల అభివృద్థి, చెర్వుల సుందరీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి కలెక్టర్ ప్రత్యేక అధికారిగా, ఇతర నగర పంచాయతీకి జాయింట్ కలెక్టర్ అదనంగా అవసరమున్నచో జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారిగా నియమించుకొని ప్రతి పనిని స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. పబ్లిక్ హెల్త్, ఆర్‌అండ్‌బి, మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఇతర శాఖల అధికారులను సమన్వయపర్చి ఒక కాల పరిమితిని నిర్దేశించుకొని పనులు పూర్తిచేయాలన్నారు. రోడ్ల విస్తరణ, జంక్షన్ల ఏర్పాటు, పార్కుల చెర్వులు, మోడల్ మార్కెట్లు, వైకుంఠదామం అభివృద్థి పనులకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మున్సిపల్ కమిషనర్‌తో సమీక్షించుకుంటూ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ వీక్షణలో జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
కొత్తగూడెం, మార్చి 13: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యులను ప్రభుత్వం అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవరాం స్థానిక సూపర్‌బజార్ సెంటర్లో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు బత్తుల వీరయ్య, మైనారిటీ నాయకుడు ఎస్‌కె అన్వర్‌పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శాసన సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం మంత్రి పదవికి రాజీనామ చేసిన కోమటరెడ్డి వెంకటరెడ్డి లాంటి శాసన సభ్యుడిపై ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతుందని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరాటే రామస్వామి, ఆరీఫ్‌ఖాన్, జాన్‌బాషా, మాదాసి శ్రీరాములు, బందుగుల శ్రీ్ధర్, ఎస్‌కె జాని, సుధీర్, కుమార్, నిఖిల్,రాణాప్రతాప్, రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

3కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
భద్రాచలం టౌన్, మార్చి 13: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపుమేరకు భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాసరెడ్డి, నక్కా ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్యులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడి, పరిష్కారం కోసం చర్చించి, ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుందనే భయంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పిరికితనం, తప్పించుకునే ధోరణి కప్పి పుచ్చుకునేందుకు ఇటువంటివి చేస్తుందన్నారు. ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలు వదిలేసి ప్రగతిభవన్‌కే పరిమితమై కాంట్రాక్టులలో కమీషన్ల కోసం పని చేస్తున్న కేసీఆర్ అసెంబ్లీని కూడా అవమానించారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రమేష్‌గౌడ్, ఉడతా రమేష్, వెంకటేశ్వరరెడ్డి, రాచమళ్ళ రాము, యర్రంశెట్టి నర్సింహారావు, రాగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.