ఖమ్మం

సేవాలాల్ జాతరలో అపశృతి * సౌండ్ బాక్స్ మీద పడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, మార్చి 22: డీజే సౌండ్ బాక్స్ మీద పడి ఒక బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం పాల్వంచ మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం, ఇల్లందులపాడు తండాలో గురువారం సేవాలాల్ మహరాజ్ ఆధ్వర్యంలో బుడియబాపు వెంకటేశ్వరస్వామి జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జాతర సందర్భంగా గ్రామంలో టాటా ఎసీ మ్యాజిక్‌పై డీజే సౌండ్ బాక్స్‌ల ద్వారా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని యువకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ, ఆనందోత్సాల నడుమ జాతరను కొనసాగిస్తుండగా టాటా ఏసీ ఆటోపై ఉన్న డీజే సౌండ్ బాక్స్‌లకు డిష్ వైర్ తగిలింది. ఆటోడ్రైవర్ డిష్ వైర్‌ను చూడకుండా ముందుకు వెళ్లడంతో ఆటో పై ఉన్న డిజె సౌండ్ బాక్స్, ఆటో పక్కనే డాన్స్ వేస్తున్న ఇల్లందులపాడు గ్రామానికి చెందిన బాలుడు పృద్విరాజ్ (7)పై పడింది. దీంతో పృద్విరాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు.

మణుగూరు ఎంపీపీ మృతి
మణుగూరు, మార్చి 22: మణుగూరు మండలం ఎంపిపి చిడెం అంజమ్మ (45) గుండెపోటుతో బుధవారం రాత్రి ఆకస్మికంగా కన్నుమూశారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అంజమ్మ బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారని, ఆమెను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లుగా ధ్రువీకరించారని తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న అంజమ్మ కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందారు. దీనికి తోడు గుండెపోటు కూడా రావడంతో ఆమె అకాల మరణం చెందారు. అంజమ్మ మృతితో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు మండలంలోని అన్ని పార్టీల నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అంజమ్మ స్వస్థలమైన సాంబాయిగూడెం గ్రామంలో ఆమె పార్థికదేహాన్ని సందర్శించిన నేతలు నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ మండల నాయకులు పోసం నర్సింహారావు, యాదగిరిగౌడ్, తూపూడి శ్రీను, అడపా అప్పారావు, డేగల రమణ, ఎమ్మెల్యే సతీమణి పాయం ప్రమీల, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ సూరపాక విజయనిర్మల, టీఆర్‌ఎస్ మండల నేతలు ముత్యంబాబు, నాగకృష్ణ, తిరుమలేష్, సీపీఐ నేతలు అయోధ్య, పుల్లారెడ్డి, టీడీపీ నేతలు కోలేటి భవానీశంకర్, బాబు, కేవీ రావు, సీపీఎం నేతలు నాగేశ్వరరావు, ఎన్.నాగేశ్వరరావులతో పాటు పట్టణ ప్రముఖులు ఉన్నారు.

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
ఏన్కూరు, మార్చి 22: మండల పరిధిలోని జన్నారం సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన విద్యార్థి మృతదేహం గురువారం మాధ్యాహ్నం లభ్యమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జన్నారం పంచాయతీలో కొనాయపాలెం గ్రామానికి చెందిన పామర్తి విజయ్(19) ప్రమాదవశాత్తు వాగులోపడి గల్లంతైనాడు. దీంతో కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో ఆప్పటి నుండి వెతకసాగారు. వాగులో గల్లంతైన సమీపం నుండి సుమారు కిలోమీటర్ దూరంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం వద్ద తల్లి తండ్రులు రోదిస్తున్న తీరు పలువురుని కంట తడి పెట్టించింది. మృతదేహాన్ని ఇంటికి తీసుక రాగానే విద్యార్థి గల్లంతైన వాగు కొణిజర్ల మండల పరిధిలో ఉండటంతో అక్కడి నుండి పొలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.