ఖమ్మం

మావోయిస్టు డెప్యూటీ కమాండర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 22: భద్రాచలం డివిజన్‌లో పోలీసులు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోలు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలను మూసివేసిన పోలీసులు వారికి సహకరించే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. మావోయిస్టులు మందు పాతరలు తయారు చేసుకోవడానికి అవసరమైన ముడి పదార్థాలను స్థానిక గిరిజనుల నుంచి తెప్పించుకుంటున్నారనే పక్కా సమాచారంతో భారీ స్థాయిలో భద్రాచలం వద్ద పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకొని 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా చర్ల మండలంలో మరొకరిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా గురువారం మధ్యాహ్నం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చర్ల పోలీసులు కలివేరు సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి తారసపడ్డాడని, అతనిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా మావోయిస్టు అని వెల్లడైందన్నారు. కిష్టారంపాడుకు చెందిన సోడి ఉంగయ్య కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల మణుగూరు ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడని, ఈ విషయం విచారణలో వెల్లడైందన్నారు. అతని వద్ద మావోయిస్టు అగ్రనేతలకు చేరవేస్తున్న 20 డిటోనేటర్లను, మరో 8 జిలిటెన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. మావోయిస్టు అగ్రనేతలు అజాద్, హరిభూషణ్ తదితరులకు కొంతకాలంగా పేలుడు సామాగ్రిపై దృష్టిసారించారని, ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పేలుడు సామాగ్రి సరఫరా అవుతుండటంతో దీనిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మావోలు పేలుడు పదార్థాలతో విధ్వంసానికి దిగే ప్రమాదం ఉందన్నారు. అరెస్టు చేసిన ఉంగయ్యను రిమాండ్‌కు పంపుతున్నామని తెలిపారు. అనంతరం గతంలో లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు ఎస్పీ ప్రభుత్వం కల్పించిన పునరావాసాన్ని అందజేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన చర్ల మండలం పూసుగుప్పకు చెందిన ఇర్పా లక్ష్మణ్‌కు రూ.లక్ష, చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన సోడి దుడవయ్యకు రూ.4లక్షలు, చర్ల మండలం కిష్టారంపాడుకు చెందిన మడకం జోగికి రూ.4లక్షలు, చర్ల మండలం బత్తినపల్లికి చెందిన సున్నం శ్రీదేవికి రూ.4లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం చూపుతుందని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, సీఐ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.