ఖమ్మం

పుట్టిన రోజు కూడా ప్రజలకే అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 20: పుట్టిన రోజును కూడా ప్రజలకే అంకింత చేసిన ఘనత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకే దక్కిందని, ప్రజల సమస్యలను తీర్చటంలో, నిత్యం ప్రజల కోసమే అలోచించే వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబునాయడును టిడిపి శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయడు జన్మదిన సందర్భంగా శుక్రవారం స్థానిక టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా సీనియర్ నాయకులు వల్లభనేని గంగాధర్‌చౌదరి కేక్‌ను కట్ చేసి మిఠాయిలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నామా, సండ్ర మాట్లాడుతూ గతంలో అధికారంలో లేనప్పుడు 2013వ సంవత్సరంలో ఆరుపదుల వయస్సులో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గాను 217రోజులలో సుమారు 2,800కిలోమీటర్లు తెలుగురాష్ట్రాలలో పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా ఆయన జన్మదిన రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల కోసం దీక్ష చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి తన నిరసన చేస్తు దీక్ష చేయటం అభినందనీయమన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తన మార్క్‌తో ప్రపంచ దేశాలు మెచుకునే విధంగా భారతదేశంలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉండే విధంగా కృషి చేశారని పేర్కొన్నారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తెలుగు జాతి ఎక్కడ ఉన్న కూడా ఐక్యంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో పోటీపడాలన్నారు. విజయవాడలో ధర్మదీక్ష చేపడితే ఇప్పుడు ఉదయానికే అక్కడి సభ పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోయింది అంటే వర్గాల ప్రజల సంక్షేమం కోసం టిడిపితో కలిసి వచ్చే వారితో కలిసి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. టిడిపి కార్యకర్తల రక్షణ కోసం ఎవరయినాప్రమాదంలో మరణిస్తే వారిని అదుకోవటానికి కార్యకర్తల సంక్షేమ నిధిన ఏర్పాటు చేశారన్నారు. దీనిలో భాగంగానే కారేపల్లి మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన కుంజూ అదినారాయణ మరణించటంతో ఆయన కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, వల్లంకొండ వెంకట్రామయ్య, గాజుల క్రిష్ణమూర్తి, ఎలూరి శ్రీనివాసరావు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ బోర్డు సభ్యునిగా మరోసారి సండ్రకు అవకాశం
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 20: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ డైరక్టర్‌గా తిరిగి మరోకసారి టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దక్కింది. శుక్రవారం టిటిడి బోర్డు సభ్యుల నియమకాల్లో సండ్రకు తిరిగి స్థానం కల్పించేలా నిర్ణయం తీసుకోవటంతో మరోసారి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం కలిగిందని టిడిపి శ్రేణులు వెల్లడిస్తున్నారు. ఆయన నియమకం పట్ల ఇరు జిల్లాల ప్రజలతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో పాటు పలువురు శుభకాంక్షలు తెలిపారు.

డీఎంహెచ్‌హెవో, నర్సు ఉదంతంపై విచారణ
* అడిషనల్ జాయింట్ డైరక్టర్ ప్రభావతి
బోనకల్, ఏప్రిల్ 20: వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు బోనకల్ పిహెచ్‌సిలో పనిచేస్తున్న నర్సు జ్యోతి, జిల్లా వైద్యాధికారి కొండలరావుపై క్షేత్రస్ధాయి విచారణ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. స్థానిక పిహెచ్‌సిలో శుక్రవారం నర్సు జ్యోతిని, సిబ్బందిని విచారించారు. జ్యోతిని విచారణాధికారులు లిఖితపూర్వకంగా సమస్యను తెలియజేయాలనగా ఆమె వివరించింది. ఈ సందర్భంగా విలేఖర్లతో డాక్టర్ ప్రభావతి, విక్రమ్‌కుమార్ మాట్లాడుతూ జ్యోతి గతంలో పనిచేసిన వైద్యశాలల్లో కూడా విచారణ జరుపుతామని, అనంతరం డిఎంఅండ్‌హెచ్‌వో కొండలరావును కూడా విచారిస్తామన్నారు. నివేదికను కమిషనర్‌కు అందచేస్తామన్నారు. బాధితురాలు జ్యోతి విలేఖర్లతో మాట్లాడుతూ విచారణ అధికారులు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. డిఎంఅండ్‌హెచ్‌వోకు అనుకూలంగా విచారణ జరుగుతుందన్నారు. తాను శారీరకంగా లొంగనందుకే కొండలరావు కక్ష సాధింపులో భాగంగానే తనను దూరప్రాంతాలకు బదిలీ చేశాడన్నారు. గత వారం రోజులుగా తనపై ఇంకా తీవ్రమైన ఒత్తిడులు పెరిగాయన్నారు. వైద్యశాఖ సిబ్బందితో కాకుండా వేరే శాఖ ఉన్నతాధికారులతో విచారణ జరిపితేనే తనకు న్యాయం జరుగుతుందని ఫేర్కొంది. డిఎంఅండ్‌హెచ్‌వో పదవిలో ఉంచి విచారణ జరిగితే నిజాలు బయటకు రావని ఇంకా 100మంది పైగా బాధితులు ఉన్నారని బయపడి బయటకు రావటం లేదన్నారు.