ఖమ్మం

రంజుగా కార్పొరేషన్ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 20: ఖమ్మం కార్పొరేషన్‌లో కమిషనర్‌కు కార్పొరేటర్లకు మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతొంది. కొంత కాలం క్రితం బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ సందీప్‌కుమార్‌ఝాతో తమకు సమస్యలు ఉన్నాయని, ఆయన తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతుందని, కొంత కాలంగా ఆరోపిస్తు వస్తున్న కార్పొరేటర్లు తమ డిమాండ్‌ను ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. కార్పొరేటర్ల సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదని, ప్రజల వద్ద తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. తాజాగా మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తమ సమస్యను చెప్పుకునే పరిస్థితి కూడా పెద్దలు లేకుండా చేశారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కార్పొరేషన్‌లో సమావేశం ఏర్పాటు చేసి దానికి కమిషనర్‌ను ఆహ్వనించినా ఆయన రాకపోవటం, ఆయనను సమావేశానికి రప్పించాలంటూ మేయర్‌తో వాగ్వివాదం చేయటం, సమావేశానికి రావాలని మేయర్ ఆహ్వనించినా కమిషనర్ రాకపోవటం మరింత వివాదానికి దారి తీసింది. తాము ప్రజల మద్దతుతో గెలిచినా కమిషనర్ వ్యవహార శైలితో ఏమి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో 25వ డివిజన్ కార్పొరేటర్ తాను వ్యక్తిగతంగా దరఖాస్తు చేసిన మరణ ధృవీకరణ పత్రానికి అనేక కాగితాలు కావాలని అడిగారని, అవన్ని ఇచ్చినా నేటికి ధృవ పత్రం అందలేదన్నారు. తమకే ఈ పరిస్థితి ఉంటే ప్రజలకు తాము ఏమి చేయగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కమిషనర్ వ్యవహార శైలిపై ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో పాటు జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు కూడా కమిషనర్ వ్యవహార శైలిపై కార్పొరేటర్లు ఫిర్యాదులు చేశారు. త్వరలోనే హైదరాబాద్ వెళ్ళి మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఒక కార్పొరేటర్ తెలిపారు.
కాగా వివాదాన్ని అవకాశాంగా తీసుకున్న ప్రతిపక్షాలు అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏమి అభివృద్ధి చేయలేక వాదులాడుకుంటున్నారని, ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక అధికార పార్టీ కార్పొరేటర్లు ఇబ్బందులు పడుతున్నారని, దానిని నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల, కార్పొరేటర్ల వ్యవహార శైలిపై ప్రజలను సమీకరించి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు మాత్రం తమ పెద్దల నిర్వాకం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.