ఖమ్మం

ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఏప్రిల్ 24: కోర్టు విధులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడిన ముగ్గురు కానీస్టేబుళ్ళపై పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సస్పెన్షన్ వేటువేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సత్తుపల్లి హెడ్ కానీస్టేబుల్ ఎస్ పాపయ్య, కానీస్టేబుల్ బి బాలాజీ, కల్లూరు కానీస్టేబుల్ జి వెంకటేశ్వరావులు సత్తుపల్లి కోర్టులో విధులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడడంతో వారిపై సిపి వేటువేశారు. సత్తుపల్లి జెఎఫ్‌సిఎం కోర్టులో ఈ నెల 22న నిర్వహించిన లోక్‌అధాలత్‌లో సత్తుపల్లి, కల్లూరు పోలీస్‌స్టేషన్‌లకు సంబందించిన కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కారమైన ఈ కేసులలో కోర్టు మేజిస్టేట్ కక్షిదారులకు విధించిన జరిమానా కంటే కోర్టు కానీస్టేబుళ్ళు అధికమొత్తంలో కక్షిదారుల నుండి అక్రమంగా డబ్బులు వసూళ్ళకు పాల్పడ్డారు. ప్రాథమిక విచారణలో వారి అక్రమాలు రుజువుకావడంతో ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. శాఖాపరంగా మరింత లోతుగా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకున్నట్లు సిపి తెలిపారు. ఇలాంటి అనైతిక చర్యలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.