ఖమ్మం

మొక్కజొన్నలు, ధాన్యాన్ని కొనుగోలు చేయరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, ఏప్రిల్ 24: గత 15రోజులుగా మొక్కజొన్న, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేసి రాస్తారోకో చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రైతులు తీవ్రఆందోళనతోపాటు రాస్తారోకో చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులను, వారి సమస్యలను పట్టించుకోవడంలేదని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి బొంతు రాంబాబు ఆరోపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 15రోజులుగా కొనుగోలు చేయకమపోవడంతో రైతులు మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనే సంచులులేవు, ఎగుమతిలేదు, లారీలు లేవు, ఇలా ప్రతి విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గొప్పలు చప్పుకోవడం తప్ప పని మాత్రం చేయడం లేదని అన్నారు. ఇది ఇలా ఉండగా గంటపాటు ట్రాఫిక్ అంతరాయం కావడంతో స్థానిక ఎస్సై తాండ్ర నరేష్ రైతులకు, సిపిఎం నాయకులకు నచ్చజెప్పి రెండురోజుల్లో సమస్యను పరిష్కరించే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో రైతులు విరమించారు. ఈకార్యక్రమంలో తాటిపుడి ఎంపిటీసి మంచాల జయరావు, రైతులు మాడపాటి మల్లిఖార్జునరావు, చింతనిప్పు మురళీధర్‌రావు, సైదులు, కోటేశ్వరావు, తోట నాగేశ్వరావు, సమద్ తదితరులు పాల్గొన్నారు. ...
గరికపాడులో...
మండల పరిధిలోని గరికపాడు సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత కొన్ని రోజులుగా గోనేసంచులు లేక ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మంగళవారం గోనేసంచుల లారీ రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులే స్వయంగా గోనేసంచులు లారీ నుండి తీసుకెళ్ళారు. ఎస్సై నరేష్ సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే గోనేసంచులు అయిపోయాయి. రైతులు కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యాన్ని త్వరిత గతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రైతులకు హామీ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత కొంత సద్దుమణిగింది.