ఖమ్మం

వైద్య, ఆరోగ్య శాఖలోనూ అదే జబ్బు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 28: ఇటీవల ఐటీడీఏలోని గిరిజన ఆశ్రమాల్లో నకిలీ పిజి సర్ట్ఫికేట్లతో ఉద్యోగం వెలగబెడుతున్న ఇద్దరిని గుర్తించి తొలగించిన సంగతి విదితమే. వీరిద్దరే కాకుండా మరో ఉపాధ్యాయుడు కూడా ఉన్నారనే సమాచారంతో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగకుండానే ఐటీడీఏలోనే వైద్య, ఆరోగ్యశాఖలోనూ ఇలాంటి అక్రమాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు 61 మందికి పైగా ఉద్యోగులు నకిలీ సర్ట్ఫికేట్లతోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగింది. ఈ నకిలీ సర్ట్ఫికేట్ల వ్యవహారాలు ఐటీడీఏలో కలకలం రేపుతున్నాయి. ఉపాధ్యాయులే కాదు గిరిజనులకు వైద్యసేవలు అందించే ఉద్యోగులు కూడా నకిలీ సర్ట్ఫికేట్లతో రాజ్యమేలుతున్నారంటే భద్రాచలం ఐటీడీఏలో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
2011 హెల్త్ అసిస్టెంట్ల నియామకాలపై దృష్టి
ఐటీడీఏలో నకిలీ సర్ట్ఫికేట్లతో హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. గతంలోనే ఇల్లెందు ఏజెన్సీలోని ఓ పీహెచ్‌సీలో నకిలీ ఎంపీహెచ్‌డబ్ల్యు(మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్) సర్ట్ఫికేట్‌తో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలతో విచారణ జరిపించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇతను 2011 ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ సమయంలో ఐటీడీఏలో ఉద్యోగం సాధించారు.
ఆయన తరహాలోనే మొత్తం 61 మంది నియమితులయ్యారు. కానీ ఒక్కరిని మాత్రమే తొలగించి మిగిలిన వారిని ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఐటీడీఏలో హెల్త్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారనే సమాచారంతో కొందరు విశాఖలోని ఓ సంస్థలో చదివినట్లుగా ఎంపీహెచ్‌డబ్ల్యు సర్ట్ఫికేట్లు తెచ్చుకున్నట్లుగా సమాచారం. ఒక్కో సర్ట్ఫికేటుకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఖమ్మం జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తీసుకుని విశాఖ నుంచి తెప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐటీడీఏలోని ఉద్యోగే ఇందులో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌శాఖ రంగంలోకి దిగింది. 2011లో వైద్య, ఆరోగ్యశాఖలో కొలువు తీరిన హెల్త్ అసిస్టెంట్ల సర్ట్ఫికేట్లపై దృష్టిసారించింది.
కొనసాగుతున్న విచారణ
విజిలెన్స్‌శాఖ 2011లో హెల్త్‌అసిస్టెంట్ ఉద్యోగాలు పొందిన సమర్పించిన అన్ని సర్ట్ఫికేట్లను పరిశీలిస్తోంది. ఐటీడీఏలోని వైద్య, ఆరోగ్యశాఖ నుంచి వారి ఎంపిహెచ్‌డబ్ల్యు సర్ట్ఫికేట్లతో పాటు స్టడీ సర్ట్ఫికేట్లు, మెమోలు అన్నీ పరిశీలిస్తోంది. గత రెండేళ్లుగా విచారణ సాగుతూనే ఉంది. కానీ ఒక కొలిక్కి రాలేదు. తాజాగా తెలుగు పండిట్ల నిర్వాకం బయటపడటంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 2011లో నియామకమైన హెల్త్ అసిస్టెంట్ల సర్ట్ఫికేట్లు సరైనవా? కావా? అనే కోణంలో తిరిగి విచారణ జరుపుతున్నారు. తాజాగా మళ్లీ వైద్య,ఆరోగ్యశాఖలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురం పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి సమాచారం తీసుకున్న విజిలెన్స్ శాఖ విచారణ వేగవంతం చేసింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.