ఖమ్మం

రాజకీయ ఒత్తిడులకు తలొగ్గొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాల కేటాయింపుల్లో రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక టిటిడిసి భవనంలో స్వయం ఉపాధి యూనిట్ల కేటాయింపు, దళితులకు భూ కొనుగోలు పథకం, తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిసి, ఎస్సీ, ఎస్టీ యువతకు 80శాతం రాయితీతో స్వయం ఉపాధి యూనిట్లను అందిస్తుందని, దానిని వినియోగించుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాయితీ ఎక్కువ కావటం వల్ల లబ్ధిదారుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని, ఇందుకోసం లాటరీ పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. గతంలో గ్రౌండింగ్ అయిన యూనిట్ల ప్రస్తుత పరిస్థితిపై నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెలాఖరులోగా వెయ్యి ఎకరాల భూమిని కొనుగోలు చేసి, ఎస్సీ లబ్ధిదారులకు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడి అచ్యుతానంద గుప్తను ఆదేశించారు. కాగా జిల్లాలో వర్షాలు తగినంతగా కురవకపోవటం వల్ల భూగర్భజల మట్టం పడిపోయిందని, రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా కల్లూరు, వైరా, లంకాసాగర్, పాలేరు రిజర్వాయర్లలో తాగునీటి పథకాలకు సరిపడ నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎనె్నస్పీ అథారిత జలాలను నాగార్జున సాగర్ నీటితో నింపేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఖమ్మం జిల్లాను అన్నింటిలోనూ అగ్రగామిగా ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్, ఐటిడిఏ పివో రాజీవ్‌గాంధీ హన్మంతు, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు పాల్గొన్నారు.