ఖమ్మం

భూప్రక్షాళనతో సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, మే 21: భూ ప్రక్షాళన కార్యక్రమంతో రైతుల భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయని కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. పంపిణీ జరిగిన విధానాన్ని అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలను రైతుబంధు చెక్కులు త్వరలోనే పూర్తి చేయాలని, తీసుకోని రైతులకు వెంటనే అందించాలని సూచించారు. పంపిణీ సందర్భంగా రైతుల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదు జాబితాలను తయారు చేసి పంపాలన్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేయడం జరుగుతుందన్నారు. దొర్లిన తప్పుల విషయంలో రైతులు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని, గ్రామాల వారిగా గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామన్నారు. జూన్ 2నుంచి తహశీల్దార్ కార్యాలయంలో జరగనున్న భూ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. తహశీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ జరిగే విధి విధానాలను వివరించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న పట్టాదారు పాస్ పుస్తకం, రైతుబంధు చెక్కుల పంపిణీని పరిశీలించి పంపిణీ జరిగిన విధానాన్ని, రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ కారుమంచి శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి అనీల్‌కుమార్, ఆర్‌ఐలు రఘు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

హద్దులు దాటి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు
ఖమ్మం(క్రైం), మే 21: అవినీతి ఆరోపణలకు అవకాశం కల్పించి, హద్దులు దాటి ప్రవర్తించిన ఉపేక్షించేదిలేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్‌శాఖ ఆధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక మినీ కాన్ఫరెన్స్‌హాల్లో వైరా, కల్లూరు డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు, పోలీసులకు మధ్య మధ్యవర్తుల ప్రమేయంపై నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిఘా ఉంటుందన్నారు. రైతుబంధు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్త్ నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించాల్సిన పోలీస్ సిబ్బంది ఆరోపణలకు తావివ్వకూడదన్నారు. తేలిక పద్ధతిని అనుసరించే వారు తమ పద్ధతిని మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఎస్‌హెచ్‌వోలు మంచి పద్ధతిలో ఉంటూ తమ కిందస్థాయి సిబ్బందికి తగు సూచనలతో సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. పీపుల్స్ ప్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా యూనిఫాం సర్వీసెస్ డెలవరీ అనే అంశంపై సిబ్బందికి శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. నెలలో నమోదైన నేరాల వివరాలు, విచారణ స్థాయిలో ఉన్న కేసులపై అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లపై ప్రత్కేక శ్రద్ధ తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు సూచించారు. త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల శాంతి భద్రతల అంశంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీసీ కొల్లు సురేష్‌కుమార్, ఏసీపీలు రాజేష్, ప్రసన్నకుమార్, రామానుజం, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.