ఖమ్మం

స్థానిక సంస్థలను నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 21: టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసి స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ప్రదాని దివంగత రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి సందర్భంగా స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చేందుకు రాజీవ్‌గాంధీ చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. భారతదేశాన్ని 73,74రాజ్యాంగ సవరణ ద్వారా ఫైనాన్స్ కమిషన్ నుండి నేరుగా పంచాయతీలకే నిధులు వచ్చే విధంగా రాజీవ్‌గాంధీ కృషి చేశారన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంతోపాటు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించేందుకు స్థానిక పరిపాలనకు పునాదులు వేసిన దార్శినికుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. స్థానిక సంస్థలకు సాధారణ ఎన్నికల మాదిరిగానే ఎన్నికలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా ముందుచూపుతో రాజీవ్‌గాంధీ బాట వేశారన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి అధికారాన్ని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకుందన్నారు. మన ఊరు-మన ప్రణాళిక, గ్రామ జ్యోతిలాంటి అనేక ప్రణాళికలు తయారుచేసి గ్రామ సర్పంచుల పదవీకాలం పూర్తవుతున్నప్పటికి వాటికి సంబంధించిన నిధులను నేటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. అంతేకాకుండా ఫైనాన్స్ కమిషన్ నుండి నేరుగా పంచాయతీలకు వచ్చే నిధులను సైతం ప్రభుత్వం కొల్లగొడుతుందన్నారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను, ఎంపీటీసి, జడ్పీటీసిలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందన్నారు. గ్రామ స్వరాజ్యం కావాలనుకునే వారు, ప్రజాస్వామ్య వాదులు కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు కోల్పోయిన హక్కులకోసం పార్టీలకతీతంగా ఏకమై తిరిగి వాటిని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఏకతాటిపై నిలిచి రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరావు, పువాళ్ళ దుర్గాప్రసాద్, వడ్డెబోయిన నరిసింహారావు, దిరిశాల భద్రయ్య, కొత్తా సీతారాములు. ఎండీ తాజుద్దీన్, బాలగంగాదర్‌తిలక్, బండి మణి, శేఖర్‌గౌడ్, పంతంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.