ఖమ్మం

ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడం), మే 22: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియను ఊపందుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జులై నెలాఖరులోగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ప్రస్తుత పాలకమండళ్ళ గడువు ఆగస్టు 1న ముగియనుండడంతో ఎన్నికలు జులైలోగా నిర్వహించి వెంటనే కొత్తపాలక వర్గాలు పంచాయతీల్లో కొలువుతీరాలని ఎన్నికల సంఘం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. 2,3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అందుకు సంబందించిన నమూనా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆయా గ్రామపంచాయతీలకు పంపి పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శనగా ఉంచారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో బాగంగా జిల్లాలో బిసిల లెక్కింపు ఉప పక్రియ కొనసాగుతుంది. గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్‌ను కేటాయించేందుకు జిల్లాలోని ఆయా గ్రామపంచాయతీల్లో బిసి ఓటర్ల సంఖ్యను లెక్కిస్తున్నారు. బీసీల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు అమలుచేస్తారు. అందుకోసం జిల్లా అధికార యంత్రాంగం బిసిల గణనలో నిమగ్నమయ్యారు. ఈ ఉప ప్రక్రియను జూన్ 3కల్ల పూర్తిచేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. దీని ఆధారంగా గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు అమలుచేయనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఈ నెల 28నుండి ఉద్యోగుల బదిలీలను చేపట్టి జూన్ 8లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం కావడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గ్రామాలలో బిసిల ఓట్ల లెక్కింపు ప్రారంభంనుండే ఆయా రాజకీయ పార్టీల నాయకులు పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించారు. జిల్లాలో గ్రామపంచాయతీలను కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ఇప్పటినుండే వ్యూహరచనను చేస్తున్నారు.