ఖమ్మం

రైతు రుణాలకు నిబంధనలు ఎందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంసూరు, మే 22: వేల కోట్ల రూపాయలు తీసుకొని బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపారులకు లేని నియమనిబంధనలు, రైతు పంట రుణాలకు మాత్రం పెట్టటం సరైంది కాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుసదస్సుకు ఆయన ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకున్న రుణాలను చెల్లించని వ్యాపారులకు వేల కోట్లు ఇస్తూ అన్నం పెట్టే రైతులకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు షరతులు విధించటం ఎంతవరకు సమంజసం అన్నారు. బ్యాంకులకు ఎగవేతదారులు పెరిగిపోవటం, నగదు రద్దు తరువాత బ్యాంకు ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లింపులు చేపట్టక పోవటంతో,ప్రజలకు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లిందని ఆయన ఆరోపించారు.దీంతో బ్యాంకుల్లో డబ్బు ఉంచేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని అన్నారు.బ్యాంకులపై నమ్మకం కల్పించేందుకు బ్యాంకులు కరపత్రాలు పంపిణీ చేసే దుస్దితికి ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆరోపించారు. బ్యాంకులపై సరైన నమ్మకం కలిగించి ఖాతాదారులను రాబట్టుకోవాలని ఆయన బ్యాంకు సిబ్బందికి సూచించారు. జిల్లాలోనే రైతుపంట రణాలకు రైతుసదస్సు ఏర్పాటు చేసిన ఎస్‌బిఐ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావును అధికారులు ఆదర్శంగా తీసుకొని సదస్సులు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. పంటరుణాల విషయంలో రైతులకు అందించేవిదంగా సహకరిస్తానని ఆయన హామి ఇచ్చారు. ఇన్సూరెన్సు కంపెనీల మధ్య వ్యత్యాసాల కారణంగా రైతుకు ఇన్సూరెన్సు అందటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి పంట ఆధారిత ఇన్సూరెన్సు అందించినట్లైతే రైతుకు ఉపయోగపడుతుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి రెండు గ్రామాలకో పంట నష్టం కొలమానాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో కొన్ని గ్రామాల్లో విపత్తుల కారణంగా పంటనష్టం జరిగితే వాటిని గుర్తించే పరికరాలు మండల కేంద్రాల్లో ఉండటంతో రైతులు చెల్లిస్తున్న పంటలబీమా ఉపయోగపడకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లతో కూడిన వ్యక్తిగత పంట ఇన్సూరెన్సు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు రూ .5కోట్ల రూపాయలు అందించేందుకు ముందుకు వచ్చిన మర్లపాడు ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు కు ఆయన అభినందనలు తెలిపారు. బ్యాంకులు అందిస్తున్న సహాయాన్ని వినియోగించుకొని పంట అనంతరం తిరిగి చెల్లించి బ్యాంకులకు సహకరించాలని ఖాతాదారులను కోరారు. అనంతరం బ్యాంకుసిబ్బంది రైతులు ఎంఎల్‌ఏ సండ్రకు, బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రకాశరావు, ఏఓ శ్రీనివాసరావు, పుల్లారెడ్డి, గొర్ల సంజీవరెడ్డి, నాయుడు వెంకటేశ్వరరావు, ఉప్పలపాటి కృష్ణయ్య ,కలపాల శేఖర్, మర్లపాడు ఎంపీటీసి వెంకాయమ్మ, బాబురెడ్డి బ్యాంకు సిబ్బంది వివిధ గ్రామలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.