ఖమ్మం

కేసులు అక్రమం కాదు సక్రమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మే 22: ఖమ్మం ఎమ్మెల్యే సీపీఎం నాయకులపై చేసిన ఫిర్యాదు అక్రమం కాదని సక్రమమేనని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్‌బేగ్, రైతు సమన్వయ సమితీ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌పై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తన ఉనికిని కాపాడుకునేందుకే అసత్య ఆరోపణలకు పాల్పడుతోందన్నారు. ప్రజలు సిపిఎంను ప్రజలు నమ్మెస్థితిలో లేరని అంతరిస్తున్న పార్టీని గట్టెక్కించేందుకు బహుజనుల లెఫ్ట్ ఫ్రంట్‌ను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఖమ్మం మున్సిపాలీటిలో 30సంవత్సరాలుగా చేయని అభివృద్ధి కేవలం నాలుగేళ్ళలో ఎమ్మెల్యే చేసి చూపించారని ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. పేద ప్రజల పేరుతో కనపడిన స్థలాలలో గుడిసెలు వేయించి వాటిని సొమ్ము చేసుకున్న చరిత్ర సిపిఎందని ఆరోపించారు. సిపిఎంకు చెందిన నాయకులు కార్మికుల సమస్యలంటూ ఒకరు, రియల్‌ఎస్టేట్ వ్యాపారాలతో మరొకరు ఇప్పటికీ దందాలకు పాల్పడుతున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డబుల్‌బెడ్‌రూం, ఆసరా పెన్షన్ తదితర పథకాలతో ప్రజలు లబ్ధిపొందుతున్నారని, ఆందోళనలు చేసేందుకు సిపిఎంకు పనిలేకుండా పోయిందన్నారు. ఎంచేయలేని పరిస్థితిలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారు చేస్తున్న చౌకబారు విమర్శలు మానుకొని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నాయకులు కర్నాటి కృష్ణ, శీలంశెట్టి వీరభద్రం, సుధాకర్‌రావు, షౌకత్‌అలీ, నాగచంద్రారెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.