ఖమ్మం

ఎన్నికల కోసమే రైతుబంధు పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, మే 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రానున్న ఎన్నికల స్టంట్ మాత్రమేనని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కామేపల్లిలోని లాలునాయక్ గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుబంధు పధకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని కానీ నాలుగేళ్లుగా రైతులు గుర్తుకు రాని ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి అమలుచేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను విస్మరించి దళితులు, గిరిజనులు, మైనార్టిలు,విద్యార్దులు, నిరుద్యోగులను కొత్త పధకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. నాలుగేళ్లుగా 4.200మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారికి కనీసం టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పరామర్శించడం, ఆర్ధిక సహయం అందచేయడం కానీ చేయలేదని, నేడు రైతుల కోసమే తాము పనిచేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం శోఛనీయం అన్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలు సరాఫరా చేసిన వారి పై చర్యలు తీసుకోకపోగ రైతులకు గిట్టుబాటు ధరకలు కల్పించలేదని అన్నారు. ధరల కోసం మార్కెట్‌లో అడిగిన రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం దేశ రాజకీయాలల్లో మొట్టమొదటిసారిగా ఉన్నారని అన్నారు. వాటిని కప్పిపుచ్చుకునేందుకే ఎన్నికల ముందు రైతు పధకంతో వెళ్లుతున్నారని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి రైతులకు భూమి హక్కు పత్రాలు అందజేసిందని వారికి రైతుబంధు పధకం అమలు చేయకపోవడం శోచనీయం అన్నారు. కాగా స్ధానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజల బాంధువుడయిన రాంరెడ్డి వెంకటరెడ్డి హయంలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించిన అనేక వౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. ప్రజలల్లో మమేకమైన ఆయన ఆశీర్వదంతో గెలుపొందిన ప్రసుత్త ఎమ్మెల్యే,స్దానిక ప్రజాప్రతినిధులు ఆయనను విమర్శించడం బాధకరమని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈప్రాంతంలో అన్ని పంచాయితీలు, జిల్లా పరిషత్ స్దానాలు గెలుపోందడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆంతోటి అచ్చయ్య , నాయకులు ఏపూరి మహేందర్‌కుమార్, ఎంపిటిసి చిన్ని, రాందాస్, రాములు, లాలునాయక్,సత్యనారాయణ, నరసింహరెడ్డి,దొడ్డిగర్ల సుందరం, మల్లెపాటి శ్రీనివాస్, ద్వాళి తదితర నాయకులు పాల్గోన్నారు.

సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రధాని మోదీ
చింతకాని, మే 22: ప్రధాని నరేంద్రమోదీ సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాడని ఎవైఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దినేని కరుణకుమార్ విమర్శించారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తు మంగళవారం ఖమ్మం బైపాస్ రోడ్డుపై ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదానలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునే్నన్నడూ లేని విదంగా పెట్రోల్, డీజిల్ ధరలు అకాశాన్నంటాయన్నారు. సామాన్యుడికి ద్విచక్ర వాహనాన్ని దూరం అయ్యే అవకాశం భారత ప్రధాని కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఎఐఎస్‌ఎఫ్ పోరాడుతుందన్నారు. ఎఐఎస్‌ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెంచిన ధరలు తగ్గే వరకు నిరంతరం నిరసనలు తెలపాలన్నారు. సమాన్య ప్రజలు అండగా ఉండడమే లక్ష్యంగా యువత పోరాడాలన్నారు. ఎడాపెడా ధరలు పెరుగుతుంటే సామాన్య ప్రజలు ఎలా బతాకాలో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి పాలన అవినీతి పరులు, బ్యాంకులను మోసం చేసేవారికి అండగా ఉంటుందని. సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచిన వెంటనే ధరలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షులు అబ్బూరి మహేష్, , పోటు సుదర్శన్, జగదీష్, కిట్టు, రామారావు, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సమరానికి కాంగ్రెస్ కసరత్తు
* 29లోగా బూత్ కమిటీల ఎన్నిక

ఖమ్మం, మే 22: స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తన శ్రేణులను సమరానికి సన్నద్ధం చేస్తోంది. జూన్ నెల ఆఖరులోగా ఎన్నికలు పూర్తి అవుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామాల వారీగా ఉన్న బూత్ కమిటీలను ఈ నెల 29వ తేదీలోగా ఎంపిక చేయాలని జిల్లా నాయకత్వాలను ఆదేశించింది. ప్రతి కమిటీలో 14మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కమిటీకి ఒక సోషల్‌మిడియా సమన్వయకర్తను నియమించాలని సూచించింది. ఇప్పటికే నియోజకవర్గ మండల స్థాయి కమిటీల నియమకాలు పూర్తి అయిన నేపథ్యంలో గ్రామ బూత్ స్థాయి కమిటీలను ఎంపిక చేసి వారికి ఈనెల 30వ తేదీన హైదరాబాద్ గాంధీభవన్‌లో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించేందుకు చేయాల్సిన ప్రయత్నాలను జిల్లా నాయకత్వం ఇప్పటికే పరిశీలిస్తోంది. పిసిసి ప్రతినిధులు, మాజీ మంత్రులతో పాటు ప్రధాన నాయకత్వం గ్రామాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటి స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహం రచిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మెజారిటి అభ్యర్థులను గెలిపించుకోవటం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తొంది. అందులో భాగంగా బూత్ కమిటీల్లో బలమైన నాయకులను నియమించటం చేయనున్నట్లు కాంగ్రెస్ ఒక నేత తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో వెళ్తున్నామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో మెజారిటి స్థానాలను గెలుచుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని తెలియజేసే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.