ఖమ్మం

రైతుబంధు పంపిణీపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 25: రైతులకు వ్యవసాయ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీలో లోపాలను సరిచేసేందుకు తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీపై రెవిన్యూ, వ్యవసాయశాఖల అధికారులతో స్థానిక డిఆర్‌డివో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్ పుస్తకాల్లో తప్పులను సరిచేసేందుకు తహశీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. తప్పులను సరిచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు, తహశీల్దార్లు, ఐకెపి సిబ్బంది సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలన్నారు. జూన్ 20నాటికి తప్పులను సరిచేయాలని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా అందించిన పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా అదర్‌సిన్హాను నియమించిందని తెలిపారు. జిల్లాలోని 359 గ్రామాల్లో 107694 మంది రైతులు రూ 125.48కోట్లు విలువ కల్గిన 109767చెక్కులు మంజూరీ అయినట్లు తెలిపారు. 359 గ్రామాల్లో నూరు శాతం చెక్కుల పంపిణీ సక్రమంగా జరుగకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 75874 మంది రైతులకు రూ 88.41కోట్ల విలువ కల్గిన 77021 చెక్కులను పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. జిల్లాలో 31828 మంది రైతులకు రూ 37.07కోట్లు విలువ కల్గిన 32746 చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అటవీహక్కుల యాజమాన్యం చట్టం ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద 80 గ్రామాల్లో 21713 మంది రైతులకు 21718 చెక్కులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ 54 మంది రైతులకు 4678 చెక్కులు మాత్రమే పంపిణీ చేయటం జరిగిందని వివరించారు. మిగిలిన 17040 చెక్కులను పంపిణీ చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. చెక్కుల నందు పేర్లు తప్పుగా నమోదు అయితే తహశీల్దారు ధ్రువీకరణ ఆధారంగా నగదు చెల్లింపులు చేయాలని లీడ్ బ్యాంకు అధికారిని ఆదేశించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ చెక్కుల పంపిణీని వేగవంతం చేయాలన్నారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ వివరాల సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. రైతు భీమా పథకంకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఐటిడిఎ పివో పమేలా సత్పతి, జిల్లా రెవిన్యూ అధికారి కిరణ్‌కుమార్, రెవిన్యూ డివిజన్ అధికారి రవీంద్రనాధ్, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి పుల్లారావుతోపాటు వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న రైతుల అవస్థలు
చింతకాని, మే 25: మండల పరిధిలోని నాగులవంచ, చింతకాని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళిన రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల చుట్టు తిరుగుతున్నారు. 15రోజులైనా కాంటాలు వేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడటం కంటే ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. ప్రతిరోజు వాతవరణంలో మార్పులతో గాలిదుమారం, అడపాదడపా వర్షాలు వస్తుండడంతో ఎప్పుడు అకాల వర్షాలతో, గాలులతో తమ పంటలు ఎక్కడా చెడిపోతాయోనని ఆందోళనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. మరో 20రోజులు కాంటాలు వేసినా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న పంట పూర్తి అయ్యే పరిస్థితి కనుబడటం లేదని కొనుగోలు కేంద్రాలను నమ్ముకుంటే రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపధ్యంలో రైతులు పొలం పనులకు వెళ్ళకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అలసత్వంతోనే విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేసి, కొనుగోలు కేంద్రాలలో ఉన్న మొక్కజొన్నలను కాంటాలు వేసి నగదు అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.