ఖమ్మం

పోడు భూములకు పట్టాలిచ్చి రైతుబంధు పథకం వర్తింపజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మే 25: గిరిజన, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడుభూములకు పట్టాలిచ్చి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించి తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బానోతు ధర్మా మాట్లాడుతూ గత 50 ఏళ్ల క్రితం నుంచి మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేద గిరిజన, గిరిజనేతరులు పోడు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. పోడుభూములకు పట్టాలు ఇవ్వకపోవటంతో భూమిపై హక్కులేక పోవటం, బ్యాంకుల ద్వారా రుణాలు పొందలేక నిరుపేద రైతాంగం పంటల సాగుకు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇటీవల ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా సన్న,చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజన, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వటంతోపాటు, రైతుబంధు పథకాన్ని వర్తింపచేసి రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చీమలపాటి భిక్షం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఊడల వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల అధ్యక్షుడు గోపు జానకిరాములు, పద్దం సుగుణ, గోవిందు, కుదురుపాక సత్యం, లేళ్ల పుల్లయ్య, నర్శింహారావు, రమేష్, లేళ్ల సీతయ్య, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, కంది నాగేశ్వరరావు, యాసా శేఖర్, యాసా రోశయ్య, కాశిబోయిన రామారావు, పొనె్నబోయిన పుల్లయ్య తదితులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం అక్రమదారులపై చర్యలు తీసుకోవాలి
గార్ల, మే 25: గార్ల శిఖం భూమిని అక్రమించుకొని అక్రమంగా సాగు చేస్తున్న భూమిని స్వాధీనం చేసుకొని, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని చెరువు ఆయకట్టుదార్లు, అఖిలపక్షం నాయకులు గార్ల తహశీల్దార్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. ఈ మేరకు తహశీల్దార్‌కు అందించిన వినతిపత్రం ప్రతులను శుక్రవారం స్థానిక విలేఖరులకు అందించారు. గార్ల పెద్ద చెరువు శిఖం దాదాపు 400ఎకరాలుండగా వంద ఎకరాలకు పైగా అక్రమణకు గురైందని, అక్రమణదారులు బావులు త్రవ్వించి విద్యుత్ మోటార్లు అమర్చి రెండు పంటలు సాగు చేస్తున్నారని, దీంతో గార్ల పట్టణ ప్రజలకు ప్రతి వేసవిలో తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. కాగా త్రీబులార్ పథకం క్రింద మంజూరైన కోటి 43లక్షల రూపాయాలతో జరుగుతున్న గార్ల మరమ్మత్తు పనులు పటిష్టపర్చాలని, కాకతీయ రాజుల కాలంలో నిర్మితమైన చెరువు కట్ట, అలుగు, పంట కాల్వలు శిథిలమైయ్యాయని, టెండర్లు పొందిన కాంట్రాక్టరుతో ప్రభుత్వ నియమ నిభందనల మేరకు పనులు జరిపించాలని వారు కోరారు. నీటిపారుదల శాఖ, రెవిన్యూ శాఖాధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి శిఖం హద్దులు నిర్ణయించాలని ఆయకట్టుదార్లు, అఖిలపక్షం నాయకులు పర్చురి కుటుంబరావు, రాజారావు, మహేశ్వరరావు, సీపీఎం మహబూబాబాద్ జిల్లా నాయకుడు కె.శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు పానుగంటి రాధాకృష్ణ, టీజిఎస్ నాయకుడు బి.హరినాయక్, ఎన్డీ నాయకుడు జి.సక్రు, తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి పి.లింగయ్య, సత్యం, యాదగిరి తదితరులు కోరారు.

అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే సహించం
గార్ల, మే 25: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోక పోతే సహించేది లేదని అంబేద్కర్ యువజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దళిత హరిజనుల మనోభావాలను భంగ పర్చే విధంగా ప్రవర్తిస్తుందని, దీనిని దళిత హరిజనులు వ్యతిరేకించాలని కోరారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గిన్నారపు మురళి, వేశమల్ల రాజశేఖర్, వెంకన్న, గిరిజన నాయకుడు మూడు శ్రీను, రాంబాబు,క్రాంతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.