ఖమ్మం

రాజధానికి చేరిన ఖమ్మం కార్పొరేషన్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మే 26: ఖమ్మం కార్పొరేషన్‌లో గత కొన్నిరోజులుగా మేయర్, కమిషనర్, కార్పొరేటర్ల మధ్య జరుగుతున్న వివాదం రాజధానికి చేరింది. కమిషనర్, మేయర్ వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్న కార్పొరేటర్లు రాష్ట్ర రాజధానిలో ఉన్న మంత్రులకు విన్నవించేందుకు శనివారం పెద్దమొత్తంలో తరలివెళ్ళారు. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించకుంటే రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్ చేరుకోవడం విశేషం. రెండురోజుల క్రితం 36మంది కార్పొరేటర్లు ఖమ్మంలో రహస్యంగా సమావేశమై తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నారు. కార్పొరేషన్‌లోని అధికారులు తమను నిర్లక్ష్యం చేయడం, కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం, పౌర సేవల జాప్యం తదితర అంశాలపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. కమిషనర్‌గా సందీప్‌కుమార్‌ఝా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కార్పొరేటర్లను సైతం లెక్కచేయకపోవడం, వారి వినతులను నిర్లక్ష్యం చేయడంపై పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్‌లో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కెటిఆర్‌లకు విన్నవించారు. సమస్యను విన్న కెటిఆర్ త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. ఖమ్మం నగరంలో మేయర్ వ్యవహార శైలి వల్ల పడుతున్న ఇబ్బందులు, ప్రోటోకాల్ సమస్య, కమిషనర్ వ్యవహార శైలిని లిఖితపూర్వకంగా మంత్రికి అందించారు. అనంతరం వారు జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి పరిస్థితిని వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు.
ఇదిలా ఉండగా ఖమ్మం కార్పొరేషన్‌గా మారిన తరువాత జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపొందగా ఇతర పార్టీల నుంచి కూడా అధిక సంఖ్యలో కార్పొరేటర్లు టిఆర్‌ఎస్‌లో చేరారు. తాజా వివాదంలో తొలుత 36మంది కార్పొరేటర్లు సమావేశం నిర్వహించుకొని డిమాండ్ల పత్రాన్ని తయారు చేసుకోగా అందులో 27మంది మాత్రమే హైదరాబాద్ తరలివెళ్ళారు. దీంతో అగ్రనేతల ఆగ్రహానికి గురవుతామనే భయంతోనే కొందరు హైదరాబాద్ వెళ్ళలేదని తెలిసింది. అయితే ఎంపి పొంగులేటి వర్గీయులుగా ముద్రపడిన ముగ్గురు కూడా ఈ జాబితాలోనే ఉండటం గమనార్హం.

బదిలీలను రద్దుచేయాలి
ఖమ్మం(ఖిల్లా), మే 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అక్రమంగా చేసిన చెక్‌స్లిప్ బదిలీలను వెంటనే రద్దుచేయాలని, రాబోయో చెక్‌స్లిప్ బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ, టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఖమ్మం జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని శనివారం డిఇఓ కార్యాలయం ముట్టడిని చేపట్టారు. ఈ సందర్భంగా టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గ్భావాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా బదిలీలన్ని పారదర్శకంగా జరగాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటామని చెప్పి ధన, రాజకీయ బలం కలిగిన వారికి అక్రమంగా దొడ్డిదారిన చెక్‌స్లిప్ ద్వారా బదిలీలు జరపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దీనికి జిల్లా డిఇఓ కూడా వత్తాసు పలుకుతూ పారదర్శకంగా బదిలీలు జరిగాయని చెప్పడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. నగరంలో పనిచేస్తున్న వారిని అదే నగరంలో కేవలం రెండుకిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. విద్యను పరిరక్షిస్తామని చెబుతున్న పాలకులే దొడ్డిదారి బదిలీలు పాల్పడటం ఆందోళన కలిగిస్తుందన్నారు. అక్రమంగా చేపట్టిన చెక్‌స్లిప్ బదిలీలను రద్దు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కె నర్సింహరావు, ఎస్‌టిఎఫ్ టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, ఎస్‌యుటిఎస్ జిల్లా అధ్యక్షులు శేషయ్య, టిఎస్‌పిటిఏ జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్ వీరబాబు, వి వెంకటేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, రవికుమార్, రమాదేవి, నాగిరెడ్డి, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.