ఖమ్మం

అక్రమ బదిలీలపై ఉపాధ్యాయుల ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 26: ఉపాధ్యాయుల బదిలీలు అక్రమంగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. ప్రభుత్వం పారదర్శకంగా బదిలీలు చేయకుండా దొడ్డిదారిన ఉపాధ్యాయులను బదిలీలు చేస్తోందని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు ఆరోపించారు. పైరవీలకు ప్రాధాన్యత ఇస్తూ కౌనె్సలింగ్ విధానాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని టిఎస్‌టిటిఎఫ్, టిఎస్‌యుటిఎఫ్, ఎటిఎటిఎస్, టిపిఆర్‌పి, ఎస్‌టియు, ఎస్‌టిఎఫ్ సంఘాలకు చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. డిఈవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి ఆందోళనకు దిగటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్లే సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి యుఎస్‌పిసి, జెఎసిటివోల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులకు పట్టణ ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డిఈవో కార్యాలయ సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు బి రాజు. ఇ లక్ష్మణ్ నాయక్, బిజ్యా శ్రీనివాస్, సత్యనారాయణ, హరిసింగ్, రత్నాకర్, ఎస్ వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, నటరాజ్, ఎన్ కృష్ణ, రామకృష్ణరాజు, శ్రీనివాస్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్

ఖమ్మం(గాంధీచౌక్), మే 26: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ జిల్లా అధికారులను అదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శనివారం టిటిడిసిలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సన్నహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, అదేశాలకు అనుగుణంగా జూన్ 2న జిల్లా, డివిజన్, మండల, పంచాయితీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయలని అదేశించారు. ఖమ్మం నగరంలో రాష్ట్ర రోడ్డ్భువనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెవిలియన్‌గ్రౌండ్ ప్రాంతంలో ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలతో అలకరించటం జరుగుతుందన్నారు. అనంతరం పోలీస్ పరెడ్ గౌండ్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. 3రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు భక్తరామదాసు కళాక్షేత్రాన్ని సిద్దంగా ఉంచాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతక ఆవిష్కరణ చేయలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, నగరంలోని ప్రధాన కూడళ్ళలలో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని నగర పాలక కమిషనర్‌కు సూచించారు. సమాజసేవ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేయాలని అదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని, పరేడ్ గ్రౌండ్‌లో ప్రోటోకాల్, వసతి, త్రాగునీటి సౌకర్యం, ప్రధమ చిక్సిత కేంద్రంలతో పాటు తదితర ఏర్పాట్లు చేయాలని ఖమ్మం ఆర్డీవో, తహశీల్దార్‌లను అదేశించారు. ప్రజలను, విద్యార్థులను అలరింపచేసేవిధంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు ఉండాలని జిల్లా విద్యశాఖాధికారిని అదేశించారు. నిర్దేశించిన బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ సందీప్‌కుమార్‌ఝా, అడిషనల్ డిసిపి సురేష్‌కుమార్, జడ్పిసిఇవో మారుపాక నగేష్, డిపివో శ్రీనివాసరెడ్డి, డిఆర్‌డివో బి ఇందుమతి, సిపివో రాందాస్, డిపిఆర్‌వో ఎం శ్రీనివాసరావు, అధికారులు, మధన్‌గోపాల్, పూర్ణచంద్రరరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.