ఖమ్మం

సల సల కాగుతున్న ఆయిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జూన్ 17: ప్రజల నెత్తిన మరో పెను భారం పడింది. నిత్యావసర సరుకులలోని వంటనూనె ధరలు సల సల కాగుతున్నాయి. గత రెండు నెలలుగా వంటనూనె ధరలు స్వలంగా పెరుగుతుండగా రెండు రోజుల క్రితం మరింత పెరిగింది. దీంతో సామాన్యుడు లబోదిబోమంటున్నారు. దాదాపు వంటనూనె లీటర్‌కు రూ.10 వరకు పెరగటంతో ఉన్న స్టాక్ బ్లాక్ మార్కెట్‌కు డీలర్లు తరలించారు. పెద్ద మొత్తంలో ఒక్కసారిగా పెరగటంతో కొన్ని వ్యాపార సంస్థలకు ఇబ్బందికరంగా మారింది. అసలే పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రజలు తట్టుకోలేకపోతుంటే ఇప్పడు వంటనూనె ధరలు పెద్దమొత్తంలో పెంచటం పుండుపై కారం చల్లినట్లుగా తయారైంది. ఈ పెరిగిన వంటనూనె ధరలు శనివారం నుండే అమలు కావటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధర వల్ల వంటనూనె పై ఆదారపడే హోటల్స్‌కు తీవ్ర నష్టం వాటిలే ప్రమాదం ఉంది. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరుగుతుంటే ప్రజల పరిస్దితి ఆందోళనకారంగా మారుతుందని ధరలు వెంటనే తగించాలని, పెరిగిన ధరలపై ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.