ఖమ్మం

గౌరారం రైతులకు అండగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 17: పెనుబల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన రైతులకు అండగా ఉండాలని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్‌ను కోరారు. కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు కొత్త రైల్వేలైన్ మంజూరైన సందర్భంగా గౌరారం రైతులకు చెందిన వేలాది ఎకరాల సాగుభూమి రైతులు కోల్పోయో పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ గ్రామస్థులు సుమారు 200మంది రైతులు ఆదివారం ఖమ్మంలోని ఎంపి నివాసానికి వచ్చి తమ ఆవేధనను ఎంపి వద్ద వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపి వెంటనే వారందరిని కలెక్టర్ నివాసానికి తీసుకువెళ్ళి వారి బాధలను కలెక్టర్‌కు వినిపించారు. ముఖ్యంగా కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేనిర్మాణంతో గౌరారం గ్రామానికి చెందిన రైతుల సాగుభూమిని కోల్పోయి రోడ్డున పడె పరిస్థితి ఏర్పడుందని ఎంపి కలెక్టర్‌కు వివరించారు. ఏళ్ళ తరబడి సాగుచేసుకుంటున్న భూమికి పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలు దక్కడం లేదని, అర్హులైన వారందరికి పట్టాలు ఇప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దాంతోపాటు రైల్వేలైన్ వలన భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. అందుకు స్పందించిన కలెక్టర్ విచారణ కమిటీని ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామినిచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టిఆర్‌ఎస్ నాయకులు చక్కిలాల మోహన్‌రావు, ఎం నిరంజన్‌రెడ్డి, జయరాజు, కొండపల్లి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.