ఖమ్మం

రెండు జిల్లాల్లోనూ మూడు దశల్లోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 17: గ్రామ పంచాయతీ ఎన్నికలు గడువులోగానే నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఏమైనా సాంకేతిక కారణాలు ఉత్పన్నమైతే తప్ప ఎన్నికలు జూలై రెండు, మూడవ వారాల్లో జరిగే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బందికి దశలవారి శిక్షణనిస్తుండగా బ్యాలెట్ పత్రాల ముద్రణకు టెండర్లు కూడా ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించిన నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అవసరమయ్యే విధంగా గుర్తులతో కూడిన బ్యాలెట్ పత్రాలను ముద్రించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో 584గ్రామ పంచాయతీలు, 5338వార్డులుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479గ్రామ పంచాయతీలు, 4332వార్డులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 7,20,045మంది ఓటర్లు ఉండగా కొత్తగూడెం జిల్లాలో 4,98,926మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ బాక్సులు సిద్దం చేయడంతో పాటు వార్డుల వారీగా, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను విభజించి అందులో ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్లను గుర్తించారు. బిసి ఓటర్ల గణన పూర్తయిన వెంటనే జిల్లా వారీగా ఎవరికి ఎన్ని సర్పంచ్ పదవులు రిజర్వు చేయాలనే అంశాన్ని రాష్ట్ర అధికారులు నిర్ణయిస్తారు. దాని ఆధారంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు జిల్లా అధికారులు ఖరారు చేస్తారు.
ఇదిలా ఉండగా ప్రతి జిల్లాలోనూ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, కామేపల్లి మండలాల పరిధిలో ఉన్న 188సర్పంచ్, 1736వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ దశలో కల్లూరు డివిజన్ పరిధిలోని ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 204సర్పంచ్‌లు, 1862వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ దశలో ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రఘునాధపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల పరిధిలో ఉన్న 192సర్పంచ్‌లు, 1740వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని పాల్వంచ, ముల్కలపల్లి మండలాల పరిధిలో ఉన్న 174సర్పంచ్‌లు, 1534వార్డులకు, రెండవ దశలో కొత్తగూడెం డివిజన్ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి, భద్రాచలం డివిజన్‌లోని కరకగూడెం, పినపాక మండలాల పరిధిలో ఉన్న 142సర్పంచ్‌లు, 1294వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే మూడవ దశలో కొత్తగూడెం డివిజన్ పరిధిలోని లక్ష్మిదేవిపల్లి, సుజాత్‌నగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లెందు, ఆళ్ళపల్లి, గుండాల మండలాల పరిధిలో ఉన్న 163సర్పంచ్‌లు, 1404వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న డిపిఓలు ఆయా జిల్లాల పరిధిలో ఎంపిడిఓలు, తహశీల్దార్లకు ఎన్నికల నిర్వహణపై త్వరలోనే పూర్తిస్థాయిలో శిక్షణనివ్వనున్నారు. ఇప్పటికే స్టేజ్-1, స్టేజ్-2 అధికారులకు ఆయా జిల్లాల పరిధిలో శిక్షణలు పూర్తిచేశారు. పైస్థాయి అధికారులకు త్వరలోనే శిక్షణను అందించనున్నారు. ఆయా మండలాలు, డివిజన్ల వారిగా గ్రామ పంచాయతీలలో పనిచేసే ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది వివరాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత మాత్రమే వీటి వివరాలను బహిర్గతం చేయనున్నారు. దీనిని పరిశీలిస్తున్న రాజకీయ పార్టీలు ఆయా గ్రామాల్లో పాగా వేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ఏదైనా తమకే మద్దతు ఇవ్వాలని చెప్పే వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం విశేషం.