ఖమ్మం

రేషన్‌డీలర్ల సమ్మె సైరన్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, జూన్ 18: రేషన్‌డీలర్లు సమ్మెబాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 1నుండి సమ్మెచేయనున్నారు. కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, రేషన్‌డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్ 1 నుండి సమ్మె చేయనున్నారు. రేషన్ సరుకులకు డిడిలు కట్టకుండా ఆయా మండలాలకు చెందిన తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. రేషన్‌డీలర్లు సమ్మెకు సిద్ధమవడంతో రెవెన్యూ అధికారులకు చెమటలు పడుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు రేషన్‌షాపుల వద్ద అందోళనలు చేసే అవకాశం కన్పిస్తున్నది. డీలర్లు సమ్మె విరమించకుంటే అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పని స్థితి నెలకొన్నది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేషన్‌డీలర్లు సమ్మె ప్రభుత్వానికి ప్రతికూలంగా మారనున్నదని విశే్లషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుంది. ప్రభుత్వం డీలర్లపై కఠిన వైఖరి తీసుకుంటే ప్రత్యామ్నాయం చర్యలు ఏ విధంగా ఉంటాయోనని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షాలు సైతం రేషన్‌డీలర్ల సమ్మెకు మద్దతు తెలిపే అవకాశముండడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని రాజకీయ నాయకులు, విశే్లషకులు చర్చించుకుంటున్నారు.

విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 18: ముగ్గురు విద్యార్థులపై అక్రమంగా బనాయించిన తప్పుడు కేసులను ఎత్తివేసి భేషరతుగా వారిని వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాధరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న హనుమకొండలో భద్రయ్య ఇంట్లో కంచెర్ల భద్రయ్య, మందా రంజిత్‌రావు, గుండేటి సుధీర్‌లు ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో 12 మంది సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరితో పాటు పాత్రికేయునిగా పనిచేస్తున్న బండి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌చేశారన్నారు. వారి కళ్లకు గంతలు, చేతులు వెనుకకు విరిసికట్టి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిప్పి వాజేడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. 3 రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసి 9న వెంకటాపురం మండలం కొత్తపేట క్రాస్‌రోడ్ వద్ద వారిని పట్టుకున్నట్లుగా తప్పుడు రికార్డులతో వారిపై యుఎపిఎం, దేశద్రోహం, పేలుడు పదార్థాలు, ఆర్మ్‌యాక్ట్ చట్టాలతో కేసులు పెట్టి 9వ తేదిన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసిన తర్వాత ఖమ్మం కోర్టులో రిమాండ్ చేశారన్నారు. ఖమ్మం జైల్‌లో ఉన్న వారిని సోమవారం కలుసుకొని అన్ని వివరాలు సేకరించామన్నారు. ముగ్గురు విద్యార్థులు డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్‌లో పనిచేస్తున్నారని వారితో మావోయిస్ట్‌లతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో వారిని చిత్ర హింసలకు గురిచేసి తప్పుడు కేసులు బనాయించారన్నారు. రాష్ట్రంలో పౌరులకు రక్షణలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు కె రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి విప్లవకుమార్ పాల్గొన్నారు.