ఖమ్మం

సిద్ధమవుతున్న బ్యాలెట్ పేపర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 24: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 582గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిపేందుకు ఇప్పటికే ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ బూత్‌లను సిద్ధం చేసిన అధికారులు బ్యాలెట్ పేపర్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని రెండు ప్రెస్‌లలో అవసరమైన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రారంభించారు. కేవలం గుర్తులతోనే ఉండే బ్యాలెట్‌లలో ఇప్పటికే నిర్ధారించిన సీరియల్‌ల ఆధారంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ తయారు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి బ్యాలెట్ పేపర్ల నోడల్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి ఇందుమతి పర్యవేక్షణలో వీటిని సిద్దం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా సీరియల్ నెంబర్ల ఆధారంగా తయారవుతున్న బ్యాలెట్ పేపర్లను తొలుత మండలాల వారిగా విభజించి అనంతరం ఆయా గ్రామాల్లోని ఓటర్ల ఆధారంగా విభజించి అక్కడికి చేరుస్తారు. జిల్లా కేంద్రం నుండి బ్యాలెట్ పేపర్లను ఆయా మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లకు తరలించి అక్కడ నుండి పొలింగ్ ముందు రోజు సిబ్బంది ద్వారా పోలింగ్ స్టేషన్‌లకు పంపిస్తారు. ఈసారి పోటీలో ఉన్నవారి పేర్లు కాకుండా కేవలం గుర్తులు మాత్రమే ఉంటుండటం, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుండి వారం రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేస్తున్నారు. సర్పంచ్‌లకు, వార్డు మెంబర్లకు విడివిడిగా గుర్తులను కేటాయిస్తుండటంతో ముందస్తుగానే బ్యాలెట్ పేపర్లను సిద్దం చేసేందుకు అవకాశం ఏర్పడింది. కాగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ రహస్యంగా ముద్రిస్తున్నారు. ప్రతి క్షణం పోలీస్ సిబ్బందితో పాటు కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముద్రణ పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే మండలాలకు పంపించే అవకాశం ఉంది. కాగా బ్యాలెట్ పెట్టెలను ఇప్పటికే సిద్దం చేసిన అధికారులు వాటిని మహిళ ప్రాంగణంలో భద్రపరిచారు. అలాగే ఆయా కేంద్రాలలో ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగుల జాబితాను కూడా తయారు చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు.

జెన్‌కో సీఎండీని కలిసిన ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు
పాల్వంచ, జూన్ 24: జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావును శనివారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో నేషనల్ కమిషన్ ఫర్, షెడ్యూల్డ్ కులాల గౌరవ అధ్యక్షులు శ్రీరాములు ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్ నాయకులతో కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్‌సి, ఎస్‌టి సంఘం రాష్ట్ర నాయకులు బూర్గుల విజయభాస్కర్ (బాచి) ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తమ సంఘ నాయకులు శ్రీరాములు జెన్‌కో సిఎండి దృష్టికి ఎస్‌సి, ఎస్‌టిల సమస్యలైన రిజర్వేషన్ అమలు, కెటిపిఎస్‌లో అంబేద్కర్ పార్కు, కాంట్రాక్ట్ లేబర్ నియామక రిజర్వేషన్, భూనిర్వాసితుల నియామకంలో రిజర్వేషన్, డిప్లమో ఇంజినీరింగ్‌ల ప్రమోషన్‌ల పై చర్చించినట్లుగా తెలిపారు. అదేవిధంగా 3నెలలకు ఒకసారి యాజమాన్యంతో ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్‌లతో సమీక్ష నిర్వహించాలని, కెటిపిఎస్‌కు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపాలని, కోరినట్లుగా తెలిపారు. అనంతరం సిఎండిని సన్మానించామన్నారు. సిఎండిని కలిసిన వారిలో రాసూరి చంద్రశేఖర్, ఉబ్బన కృష్ణమూర్తి, పిల్లి మల్లేష్, రవికుమార్, బి చిన్నవెంకటయ్య, తదితరులు ఉన్నారు.ఇందుకు స్పందించిన సిఎండి ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.