ఖమ్మం

ఆదరిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, ఏప్రిల్ 30: పాలేరు ఉప ఎన్నికల్లో తనను ఆదరిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని సోలీపురం, ముజాహిదిపురం, రఘునాధపాలెం, శివారు తండాల్లో శనివారం టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తాగు, సాగునీరందక ప్రజలు పలు అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నేటికి అనాదలుగా మిగిలిపోయారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, అందులో భాగంగా భక్తరామధాసు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని, వచ్చే సంవత్సరం నాటికి ఇంటింటికి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మంచినీరందిస్తామని ఆయన వివరించారు. మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని గతంలోనే చెప్పామని, పాలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు పెద్ద పాలేరుగా పనిచేస్తానని, తనను ఆశీర్వదిస్తే ప్రజలకు సేవ చేసుకుంటూ తానేంటో నిరూపించుకుంటానని ఆయన అన్నారు. సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి పార్టీ మారే వ్యక్తులను ఓడించాలని, తనను, కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చి అభివృద్ధిని చూరగొనాలని ఆయన వివరించారు. రఘునాథపాలెం సర్పంచ్ అంగడి పద్మ, కాకరవాయి శివారు తండాకు చెందిన 10 సిపిఎం కుటుంబాలు హేమానాయక్ ఆధ్వర్యంలో అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాగ చంద్రారెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, మండల అధ్యక్షులు బోడా మంగీలాల్ పాల్గొన్నారు.