ఖమ్మం

ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 17: ఖమ్మం నగరంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని ఉద్యోగులకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. గత కొనే్నళ్ళుగా నిర్మాణం నిలిచిపోయి ఉన్న ఫ్లాట్స్‌లను ఉద్యోగులకు కేటాయించాలని ఇటీవల డిమాండ్ రాగా దానిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. దీంతో పరిశీలించిన నేతలు ప్రత్యేక నివేదికను తయారు చేసి మంగళవారం మంత్రికి అందించారు. ప్రస్తుతం ఉన్నవి ఉన్నట్లుగానే అయితే ఒక ధర, పూర్తి చేసి ఇచ్చేలాగా అయితే మరో ధర చెల్లిస్తామంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటి ఆధ్వర్యంలో వీటి కేటాయింపులు జరపాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి రాజీవ్ స్వగృహ అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఫ్లాట్స్‌లను అందించేందుకు కసరత్తు చేస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న వాటిని ఉద్యోగులకు ఇవ్వటం వల్ల లబ్ధి జరుగుతుందని, సంస్థకు కూడా వెంటనే డబ్బులు వస్తాయని ఉద్యోగులు మంత్రికి చెప్పారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని కావున వాటిని తమకు కేటాయించాలని వారు కోరారు.
తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించిన ఆదివాసీలు
చండ్రుగొండ, జూలై 17: దామరచర్ల రెవెన్యూలో ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్ భూములను స్వాధీనం చేయాలని లబ్ధిదారులైన ఆదివాసీలు, ఆదివాసీ నాయకపోడు సేవాసంఘం ఆధ్వర్యంలో 130 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చిన తహశీల్దార్‌తో పాటు సిబ్బందిని ఆదివాసీలు అడ్డుకొని కార్యాలయం గేటును మూసివేసి లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎస్‌ఐకు సమాచారం అందించడంతో కార్యాలయానికి చేరుకున్న ఎస్‌ఐ ప్రసాద్ ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తహశీల్దార్‌ను కార్యాలయంలోకి పంపారు. అయినా ఆదివాసీలు తహశీల్దార్ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్ళి దిగ్బంధించి న్యాయం చేయాలని నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆదివాసీ నాయకులు రాజిని వెంకటేశ్వరరావు, బేతి సామయ్య, సిద్ధిని సీతారాములుతో తహశీల్దార్ చర్చలు జరిపారు. ఈసందర్భంగా వెంకటేశ్వరరావు తహశీల్దార్‌తో మాట్లాడుతూ ఆదివాసీలకు చెందాల్సిన 130 ఎకరాల సీలింగ్ భూమి స్వాధీనం చేయాలన్నారు. గత 130 రోజులుగా కార్యాలయం ఎదుట ఎండ, వాన, చలిలో ఆందోళన చేస్తున్న ఎందుకు స్పందించలేదని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. న్యాయం చేయాల్సిన అధికారులు ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం భావ్యంకాదన్నారు. ఆదివాసీ భూములను గిరిజనేతరులు ఆక్రమించుకొని నాట్లు వేస్తున్నారని వారిని అడ్డుకోకపోతే తాముసైతం భూముల్లోకి ప్రవేశిస్తామని తహశీల్దార్‌కు తేల్చిచెప్పారు. దీంతో తహశీల్దార్ గన్య, ఎస్‌ఐ ప్రసాద్, దామరచర్ల చేరుకొని గ్రామంలోని రైతులతో సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు భూముల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించి పంటలు వేస్తే ధ్వంసం చేయడంతో పాటు కఠినచర్యలు తీసుకుంటామని రైతులను తహశీల్దార్ హెచ్చరించారు. ఆందోళనలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్‌కె ఉమర్ తదితరులు పాల్గొన్నారు.