ఖమ్మం

హస్తకళలు దేశ సంస్కృతికి ప్రతీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), జనవరి 21: హస్త కళలు దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక టిటిడిసి భవన్‌లో కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్త, చేనేత కళా ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిధిగా జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల్లో మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. ప్రధానంగా చేనేత, హస్తకళలకు ఎంతో ఆదరణ చూపేవారని గుర్తుచేశారు. అంతరించి పోతున్న చేతివృత్తులను ప్రోత్సహిస్తున్న కళాభారతి నిర్వాహకులను అభినందించారు. రాజుల కాలంలో హస్తకళలకు ప్రత్యేక స్ధానం ఉండేదన్నారు. నేడు ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్లనే ఈ కళలు అంతరించిపోతున్నాయని ఆవేదన చెందారు. ఉద్యోగాలు లేక స్వయంఉపాధికై ముందుకు వస్తున్న యువతకు ప్రభుత్వపరంగా సహకారం లభించడం లేదన్నారు. కళాభారతి నిర్వాహకులు జెల్లా సత్యనారాయణ, ఆర్ ప్రసాదరావులు మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను కచ్చితమైన ధరకే వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిటిడిసి భవన్ నందు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 2 వరకు ఉంటుందన్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలులతోపాటు మరో 11 రకాల హస్తకళలు, పోచంపల్లి, కలంకారి వస్త్రాలతోపాటు అనేక రకాల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నగర ప్రజలతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వియోగించుకోవాలని కోరారు.