ఖమ్మం

నిర్దిష్టమైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఆగస్టు 17: లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్దిష్టమైన ప్రణాళికతో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమయపాలన ద్వారా కేసులు ఛేదించడంలో సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగాలన్నారు. ప్రతి పోలీస్ అధికారికి, పోలీస్ స్టేషన్ రైటర్లకు సిసిటిఎన్‌ఎస్‌లపై పూర్తి అవగాహన కల్గి ఉండాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా 7 ఇంటిగ్రేటెడ్ ఫారంలో రోజువారి కేసులు, పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాద్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో సులభ మార్గంలో నేరాలను ఛేదించాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అనంతరం చేసే నేర పరిశోధనలో పార్ట్2లలో ఇన్‌వెస్టిగేషన్ అధికారి స్వయంగా వ్రాసిన వివరాలను నమోదుచేయాలన్నారు. నిందితులకు తక్కువ సమయంలో చట్టప్రకారం శిక్ష పడేలా విచారణ కొనసాగించాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులలో నాన్‌గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకుంటున్న చర్యలు గురించి చర్చించారు. నేర నియంత్రణలో బాగంగా జిల్లాలో ఎక్కడెక్కడ సిసి కెమేరాలు ఎన్ని ఏర్పాటుచేశారు, వాటిలో ఎన్ని కెమేరాలు పనిచేస్తున్నాయి, ఎన్ని కెమేరాలకు జియో ట్యాగింగ్ చేశారు, ఇంకా ఏయే ప్రదేశాల్లో అవసరమున్నాయో పూర్తి వివరాలు సేకరించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. నేను సైతం కార్యక్రమంలో బాగంగా అన్ని వర్గాల ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేస్తూ ప్రతి గ్రామంలో సిసి కెమేరాలు ఏర్పాటుచేయాలన్నారు. సిసి కెమెరాల వినయోగంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, పరిసరాల పరిశుభ్రత పాటిస్తున్నారోలేదో తాను ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను తామీలు చేయడంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించిన రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం పోలీస్ కానిస్టేబుల్స్ బి చందూనాయక్, టి విశ్వనాధం, విటిఎల్ జాదవ్‌లను సిపి అభినందించారు. ఈ సమావేశంలో ఏసిపిలు నరేష్‌రెడ్డి, రెహ్మాన్, రామానుజం, ఈశ్వరయ్య, సిఐలు సంపత్‌కుమార్, సాంబరాజు, వసంతరావు, తిరుపతిరెడ్డి, శివసాంబిరెడ్డి, ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.