ఖమ్మం

రోహిత్‌ది రాజకీయ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ది ముమ్మాటికి రాజకీయ హత్యేనని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ రోహిత్ ఉదంతం విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల పట్ల ఉన్న వివక్షతను తెలియ చేస్తుందన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ సిఫార్సుతో స్మృతిహిరాని చర్యలతోనే రోహిత్ బలయ్యాడన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక సాంప్రదాయ చరిత్ర, సంస్కృతి, నాగరికత, నీతి, న్యాయధర్మాలపై దాడి జరుగుతుందని, రాజ్యాంగంపై కూడా వివక్షత కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశానికి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఆయా సంఘాల నాయకులు డాక్టర్ గోపినాథ్, డాక్టర్ రాఘవులు, కోలేటి నాగేశ్వరరావు, నర్సింహారావు, శరత్, స్వాతి, స్వప్న, నాగార్జున, ప్రభాకరాచారి, నర్సింహారావు, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.