ఖమ్మం

యువతులను, మహిళలను వేధించడం మన సంస్కృతి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), నవంబర్ 15: యువతులను, మహిళలను వేధించడం మన సంస్కృతి కాదని, వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో షీటీమ్ బృందం సిపిని కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్న షీటీమ్ బృందం మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదివించడానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని యువత తమ భవిష్యత్‌పై దృష్టి సారించాలన్నారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ఇప్పటికే షీటీమ్‌ల ద్వారా 178 సదస్సుల ద్వారా అవగాహన కల్పించారన్నారు. చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థినికి రక్షణగా షీటీమ్స్ నిరంతర పర్యవేక్షణలో ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా షీటీమ్ బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందిస్తూ మెమెంటో అందజేశారు. ఇటీవల ఉద్యోగం విరమణ పొందిన వైరా డివిజన్ షీటీమ్ ఇంచార్జ్ సిహెచ్ నాగేశ్వరావును సిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి మురళీధర్, టౌన్ ఏసిపి గంటా వెంకట్రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి సత్యనారాయణ, సిసిఎస్ ఏసిపి ఈశ్వరయ్య, షీటీమ్ ఇంచార్జి, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నేదునూరి అంజలి, షీటీమ్ బృందం పాల్గొన్నారు.