ఖమ్మం

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపు.. ప్రజల చూపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, నవంబర్ 16: వచ్చే ఎన్నికలలో మధిర నుండి భట్టివిక్రమార్క అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, భట్టి గెలుపుతోనే మధిర నియోజకవర్గం అభివృద్ధి కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సధాకర్‌రెడ్డి, మీనవోలు సొసైటీ అధ్యక్షులు వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భట్టివిక్రమార్క ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మీనవోలు, చొప్పకట్లపాలెం, కొత్తపాలెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలలో ఇంటింటికి నాయకులు, కార్యకర్తలు తిరిగి మధిర అభివృద్ధి ప్రదాత మల్లు భట్టివిక్రమార్క గెలుపుతో టీఆర్‌ఎస్‌కు కనువిప్పు కానున్నదని కార్యకర్తలు వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం, ఇనగాలి గ్రామాలలో ప్రజలు భారీగా నాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజలను మోసం చేసిందన్నారు. మండలంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో భట్టికి అత్యధిక మోజార్టీ రానున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండులక్షల రూపాయాల రైతు రుణమాఫీ, పెన్షన్ రెండువేలకు పెంపు, ఇందిరమ్మ ఇంటికి 5లక్షల రూపాయలు, మధిర నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆగిన అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. నీళ్ళు నిధులు, నియామకాలు నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ నాలుగున్నర సంవత్సరాలలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. బండారు నరసింహారావు, జంగా ప్రసాద్‌రెడ్డి, కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి, రత్నాలరెడ్డి, వేమిరెడ్డి నాగిరెడ్డి, పాండురంగారావు, శేషిరెడ్డి, జాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.