ఖమ్మం

ఖమ్మం అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 16: ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఒక ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ప్రశాంతంగా జీవించేందుకు, వారి వారి వృత్తులు, విధులు, పనులను నిర్వహించుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తానన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పార్లమెంటులో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బిల్లుకు ఆనాడు ఖమ్మం ఎంపిగా ఉన్న తాను మొదటి ఓటును వేసి ప్రాంతీయవాదాన్ని చాటిచెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్ళు మనమే కల్పించుకున్నామని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, టిజెఎస్ ఆధ్వర్యంలో ప్రజాకూటమి ఏర్పడిందని, ప్రజాకూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలోను, ఖమ్మంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడటం తధ్యమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వారి ఆగ్రహం తాను ఖమ్మంలో అడుగుపెట్టిన సమయంలోనే బట్టబయలైందన్నారు. తన విజయానికి ప్రజాకూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ఇతరులు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను ఎప్పటికి ఖమ్మం వాసినని, తన నివాసం కూడా ఖమ్మంలోనే ఉందని, అటువంటి ఖమ్మం అభివృద్ధికి జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజాకూటమిలో భాగంగా తెలుగుదేశంకు రాష్ట్రంలో 14సీట్లు కేటాయించగా అందులో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లను కేటాయించారన్నారు. రాష్ట్రంలో నీటికొరత ఉందని, తమ నీరు తామే తెచ్చుకోవాలని హితవులు పలికిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నీటిని వినియోగించుకోగా మిగిలిన నీటిని సముద్రంలో వృధాగా పోతుందని, దీనిని ఆసరాగా తీసుకొని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధే ప్రజానికానికి తెలుసని, ఆనాడు అభివృద్ధి అనే మొక్కలను బాబు నాటగా ఈనాడు రాష్ట్రానికి ఫలాలు అందిస్తున్నాయన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో అధికారంలో ఉన్నవారు ఎలాంటి కొత్త అభివృద్ధి చేపట్టిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరు బ్రహ్మయ్య, నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, రాయల లత, మందడపు వెంకటేశ్వరరావు, సరిపుడి సతీష్, రంజిత్, వేణు, గొల్లపూడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కేటీపీఎస్ 7వ దశలో సాంకేతిక లోపం
పాల్వంచ, నవంబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రూ.5,500 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్ధ్యంతో నూతనంగా నిర్మిస్తున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలో తరచూ సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. ఈ కర్మాగారం నిర్మాణ పనులు దశలవారీగా పూర్తవడంతో లైటప్, సింక్రనైజేషన్ ప్రక్రియను టిఎస్ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు చేతుల మీదుగా పూర్తి చేశారు. సింక్రనైజేషన్ విజయవంతం అయిన తర్వాత కర్మాగారంలో సిఒడి చేయాల్సి ఉంది. దీనికంటే ముందు జెన్‌కో సిఎండి ఇటీవల కర్మాగారంలో పనులు 100 శాతం పూర్తవడంతో విద్యుత్ ఉత్పత్తిని సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ప్రారంభ దశలో విద్యుదుత్పత్తి అనుకున్న విధంగా 800 మెగావాట్లు వచ్చింది. 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సుమారు 70 గంటల పాటు నిరంతరాయంగా వచ్చిన తర్వాతే కమర్షియల్ డిక్లరేషన్ ఆపరేషన్ (సిఒడి) చేయాలి. కాని ఉత్పత్తి ప్రారంభ దశ నుండి కర్మాగారంలోని బాయిలర్ విభాగంలో గడిచిన 10 రోజుల వ్యవధిలో అనేకసార్లు బాయిలర్ ట్యూబులు దెబ్బతింటున్నాయి. దీంతో సిఒడి చేయాలంటే జాప్యం జరుగుతోంది. బాయిలర్ ట్యూబులు లీక్ కావడంతో బిహెచ్‌ఇఎల్, ఇతర కంపెనీలకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. బాయిలర్ ట్యూబులు, ఇతర పరికరాలు నాసిరకంవి కావడంతోనే కర్మాగారంలో తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కర్మాగారంలో ఉత్పత్తి అనుకున్న లక్ష్యానికి ముందుగానే ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు పర్యవేక్షణ లేకుండా పనులను పూర్తి చేశారనే అరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కర్మాగారంలో సిఒడి చేయాలంటే 72 గంటల పాటు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి అయిన తర్వాతనే సిఒడి చేయాల్సి ఉంది. దీన్నిబట్టి చూస్తే కర్మాగారంలో సిఒడిని చేసేందుకు మరింత జాప్యం జరిగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.