ఖమ్మం

భద్రాద్రిలో ప్రజాకూటమికే పట్టంకట్టిన ప్రజానీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ప్రజాకూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన తాజామాజీ శానససభ్యులు ముగ్గురు, తెరాసా అభ్యర్థులు ఇరువురు ఓటమి పాలయ్యారు. భద్రాద్రి జిల్లాలో తెరాసా బోణీకొట్టలేక ఎదురీదింది. మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు. ప్రజాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించడంతో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి శ్రేణులలో ఆనందం వెల్లివిరిసింది. గులాబీ దళం ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించినప్పటికీ ఐదు నియోజకవర్గాలలో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. ప్రజాకూటమికే భద్రాద్రి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఐదు నియోజకవర్గాలలో పోటీ చేసినప్పటికీ సరైన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. భారతీయ జనత పార్టీ అభ్యర్థుల విజయం కోసం కేంద్రమంత్రులు, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన్నప్పటికి కమలం వికసించలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన్నప్పటికి ప్రజల నుండి టిఆర్‌ఎస్ అభ్యర్థులకు పరాభవం ఎదురైంది. మితిమీరిన విశ్వాసం టిఆర్‌ఎస్ కొంపముంచినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌కు సైతం ఓటర్ల నుండి సరైన గుర్తింపులభించలేదు. కమ్యూనిస్టులకు కంచుకోటైన భద్రాచలం నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి మిడియం బాబురావు పరాజయంకావడం చర్చనీయాంశంగా మారింది. బహుజన సమాజ్ వాజ్ పార్టీ, ఆమ్‌ఆద్మీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లికన్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గులాబీ పార్టీని తిరస్కరించారు. ప్రధానంగా పోడు సాగుదారులు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం, ప్రజాకూటమికి కలిసివచ్చింది. అనేక వాగ్దానాలతో ప్రధాన పార్టీలు ప్రజల ముందుకు వచ్చిన్నప్పటికి ప్రజలు అధికారపార్టీని విశ్వసించలేదు. దీంతో ప్రజాకూటమికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు తన సమీప అభ్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించగా, పినపాక నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు పై కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లుపై తెలుగుదేశం అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించగా, ఇల్లెందు మాజీ శాసనసభ్యులు కోరం కనకయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోదెం వీరయ్య సమీప టిఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్‌పై విజయం సాధించారు. ప్రజాకూటిమి అభ్యర్థులు విజయం సాధించడంతో జిల్లావ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.