ఖమ్మం

నేడు వైకుంఠ ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), డిసెంబర్ 17: సంవత్సరానికి ఉన్న 24 ఏకాదశుల్లో ధనుర్మాసలో శుక్లపక్షంలో వచ్చే ఏకదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. దీనికున్న విశిష్టత, ప్రత్యేకతలు భక్తులకున్న విశ్వాసాలకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ ఏకాదశిని మంగళవారం నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. ముక్కోటి ఏకదశినాడు వైష్ణవాలయాల్లో స్వామి ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇస్తారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుడ్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ దర్శనం సూర్యోదయానికి ముందే చేసుకుంటే ముక్తి లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాలకు వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడ్ని దర్శించుకుంటే మూడు కోట్ల ఏకదశులతో సమానమని భక్తుల నమ్మకం. దీనితో భక్తులు తెల్లవారుజామునే దగ్గరలోని రామాలయాలు, వెంటేశ్వరాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శంచుకుని ప్రత్యేకపూజలు, హోమాలు, అభిషేకాలు, ప్రవచనాలు నిర్వహిస్తుంటారు. ముక్కోటి ఏకదశికి భక్తులు రోజంతా ఉపవాసదీక్షను చేపట్టి రాత్రంతా జాగరణ చేస్తారు. తరువాత జపం, ధ్యానంతో రోజంతా గడుపుతారు. ఏకదశి నాడు ఉపవాసదీక్ష చేసిన అనేక మంది భక్తులు తెల్లవారే ద్వాదశినాడు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొంతమంది భక్తులు ఇంటి పక్కలవారిని, దెగ్గర బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి కలిసి భోజనంచేసి ఉపవాసదీక్షను వదిలేస్తారు. ముక్కోటి ఏకదశికి జిల్లాలోని వైష్ణవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని ఎనె్నస్పీ క్యాంపులోని శ్రీ కోదండరామాలయం, మామిళ్ళగూడెంలోని రామాలయం, ప్రభాత్ టాకీస్ వద్ద గల రామాలయం, కమాన్‌బజార్‌లోని శ్రీ వెంకటేశ్వరాలయం, యుపిహెచ్ కాలనీలోని అభయ వెంకటేశ్వరాలయం తదితరాలయాలను నిర్వాహకులు సుందరంగా తీర్చిదిద్దారు.