ఖమ్మం

హంస వాహనంపై వైకుంఠరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్రాచలం టౌన్, డిసెంబర్ 17: గౌతమీ నదీ తీరంలో దీపకాంతుల వెలుగు జిలుగులు, భక్తజన సందోహం నడుమ అటు శాస్త్రోక్తంగా వేదఘోష వినిపిస్తుండగా.. ఇటు భక్తకోటి శ్రీరామనామస్మరణ చేస్తుండగా.. మనోహరంగా అలంకరించిన హంస వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన నీలిమేఘశ్యాముడు శ్రీరాముడు రాజఠీవితో దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు రామా.. రామా అంటూ జయజయధ్వానాలు చేశారు. సోమవారం సాయంత్రం సంధ్యవేళ చిరుజల్లులు కురుస్తుండగా హంసతూలికా యంత్ర వాహనంలో స్వాములోరు దర్శనం ఇస్తుంటే రాజసం ఉట్టిపడింది. ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు హంసాలంకృత తెప్పపై సీతారామచంద్రస్వామిని విహరింపజేయడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది స్వామిని హంస వాహనంపై ఆశీనుల్ని చేసి పూజా క్రతువులు మాత్రమే పూర్తిచేశారు. వాతావరణం మార్పు చెందడం, వర్షం విపరీతంగా కురుస్తుండటంతో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా విహారాన్ని కొనసాగించ లేకపోయారు. ఈ ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి కళ్లారా వేడుకను చూసి ఆనందపరవశులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. తెప్పోత్సవాన్ని భక్తులు నయనానందకరంగా తిలకించి పరవశించి పోయారు. రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం అనంతరం శ్రీ సీతారామ చంద్రస్వామిని విశేషంగా అలంకరించారు. మధ్యాహ్నం 3గంటలకు దర్బార్ సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారు 4.30 గంటలకు రామాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరారు. గోదావరి నదీ తీరానికి ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో భక్తుల కోలాటాలు, రామనామ స్మరణ, మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంకీర్తనలతో గోదావరి తీరం మార్మోగింది. ఉత్సవానికి తరలివచ్చిన భక్తజనంతో పావన గౌతమీ తీరం భక్త్భివంతో ఉప్పొంగింది. ముందుగా హంస వాహనానికి దిష్టి తీశారు. వాహనాన్ని నడిపే వ్యక్తిని గుహుడుగా భావించి స్వామివారి శేషవస్త్రాలు ఇచ్చారు. అనంతరం స్వామిని వాహనంపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిగాక ఉత్సవమూర్తులను హంస వాహనంపై ఉంచారు. ఆద్యంతం ఈ ఉత్సవం కన్నులపండువగా జరిగింది.
రాజాధిరాజుగా రామయ్య
గోదావరి తీరంలో తెప్పోత్సవానికి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాజాధిరాజ వాహనంపై ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామిని చూసి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులుతీరారు. మహిళలు కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల వాయిద్యాల నడుమ ఊరేగింపు వేడుక కోలాహలంగా సాగింది. గోదావరి తీరానికి చేరిన తర్వాత అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంస వాహనానికి సంప్రోక్షణ చేశారు. హంస వాహనంపై విహరించేందుకు విచ్చేసిన స్వామికి ఆలయ ఈవో రమేష్‌బాబు గుమ్మడికాయతో దిష్టితీసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా వేద పండితులు చతుర్వేదాలు, నాళాయర్ దివ్య ప్రబంధాలు, పంచ సూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. అనంతరం మంగళహారతి, చక్రపొంగలి నివేదన చేశారు. అంతకుముందు ఆలయంలో మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతితో పగల్‌పత్ ఉత్సవాలకు ముగింపు పలికారు.
శాస్త్రోక్తంగా..
స్వామిని హంసాలంకృత తెప్పపై ఆశీనులు చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. వేద పఠనం పూర్తిచేసి ప్రత్యేక ప్రసాద నివేదన చేశారు. హంస వాహనానికి చుట్టూ బలిహరణం (పొంగలి) వేశారు. సాయంసంధ్య వేళ సూర్యాస్తమయాన హంస పాన్పుపై అలంకరించిన విద్యుద్దీపాల కాంతుల్లో సీతారామచంద్రస్వామి మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత తారకబ్రహ్మ పరబ్రహ్మగా భక్తజనులు కొనియాడుతున్న రామచంద్రుడు, జ్ఞానానికి చిహ్నమైన హంస వాహనంలో తన భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. కాగా మంగళవారం స్వామివారు భక్తులకు ఉత్తరద్వార దర్శనంలో దర్శనమివ్వనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. తెప్పోత్సవ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాచలం జడ్జి రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఆలయ ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.