ఖమ్మం

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 17: సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అన్ని పార్టీలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ నెల 26వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు మండలాల వారీగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదే క్రమంలో రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగా ఆయా గ్రామాల్లో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థుల జాబితా కూడా తయారుచేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 20 మండలాలు, 584 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 5,338 వార్డులు ఉండగా ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం 7,20,045 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,57,947 మంది కాగా, మహిళలు 3,62,054 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు.
కాగా మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో పాటు అత్యధిక వార్డుల్లో పాగా వేసి ఉపాధ్యక్ష స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఖమ్మంలో టీఆర్‌ఎస్, మధిర, పాలేరులో కాంగ్రెస్, సత్తుపల్లిలో తెలుగుదేశం, వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. వైరాలో గెలిచిన రాములునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు రెండు స్థానాలున్నట్లయింది. ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ సర్పంచ్‌లను గెలిపించాల్సిన బాధ్యత పార్టీ శాసనసభ్యులకే అన్ని పార్టీలు అప్పగించాయి. శాసనసభ్యులు లేనిచోట్ల ప్రధాన నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ నేతలను, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం వ్యూహం రచిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీలుగా ఉన్న సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సాధారణ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో పంచాయతీలలో తమ పట్టు నిరూపించుకునేందుకు ఇప్పటికే గ్రామాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితమే నేతలతో సమావేశాలు నిర్వహించి బాధ్యతలు అప్పగించిన ఈ పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలకంటే పంచాయతీ ఎన్నికల ప్రణాళికలో ముందంజలోనే ఉన్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో తమ పార్టీకి వచ్చిన ఓట్లు, పంచాయతీ గెలవాలంటే కావాల్సిన ఓట్లు లెక్కవేస్తున్నారు. పంచాయతీల్లో ఖచ్చితంగా పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుండటం విశేషం.