ఖమ్మం

ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, మే 15: ఎంసెట్ పరీక్ష ఆదివారం ఖమ్మం నగరంలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 19 పరీక్షా కేంద్రాల్లో 11,423మంది అభ్యర్థులకు 10,624 హాజరు కాగా, 799మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 7402కు 7019మంది హాజరు కాగా, 386మంది గైర్హాజరయ్యారు. సాయంత్రం జరిగిన మెడిసిన్ పరీక్షకు 4021కి 3605మంది హాజరు కాగా, 416మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటంతో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. గంట ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించటంతో అభ్యర్థులు ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా సకాలంలో పరీక్షకు హాజరయ్యారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద వేసవి ఎండ తీవ్రతల దృష్ట్యా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయటంతో పాటు ఆయా పరీక్షాకేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను అందుబాటులో ఉంచారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఎంసెట్ పరీక్షల కో ఆర్డినేటర్ మాలోజి పుష్పలత తెలిపారు.